HOME »NEWS »MOVIE »rakul preet singh hot photo shoot for filmfare middle east january magazine mnj

Rakul Preet Singh: ఫిలింఫేర్ మ్యాగ‌జైన్‌ కోసం హాట్ ఫొటోకు ఫోజిచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: ఫిలింఫేర్ మ్యాగ‌జైన్‌ కోసం హాట్ ఫొటోకు ఫోజిచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్
ర‌కుల్ ప్రీత్ సింగ్ Instagram

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స‌క్సెస్ అయిన హీరోయిన్‌ల‌లో ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఒక‌రు. మొద‌ట్లో మోడ‌ల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ర‌కుల్.. ఆ త‌రువాత అంచెలంచెలుగా ఎదిగింది.

  • Share this:
    Rakul Preet Singh:  ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స‌క్సెస్ అయిన హీరోయిన్‌ల‌లో ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. మొద‌ట్లో మోడ‌ల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ర‌కుల్.. ఆ త‌రువాత అంచెలంచెలుగా ఎదిగింది. తెలుగులో అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోలకు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా.. ఇటు యువ‌ హీరోల ప‌క్క‌న న‌టించేందుకు కూడా ర‌కుల్ ఆస‌క్తిని చూపుతుంటుంది. అంతేకాదు రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ ప్రొడ్యూస‌ర్ ఫ్రెండ్లీగా ఉండే ర‌కుల్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. కేవ‌లం తెలుగుకే ప‌రిమితం అవ్వ‌కుండా.. అటు త‌మిళ్‌, ఇటు హిందీలోనూ ఈ బ్యూటీకి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

    ఇదిలా ఉంటే ప్ర‌ముఖ ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ జ‌న‌వ‌రి మ్యాగ‌జైన్ కోసం ర‌కుల్ తాజాగా ఓ ఫొటో‌కి ఫోజు ఇచ్చింది. అందులో చిన్న గౌనుతో నిషా ఎక్కించే క‌ళ్ల‌తో ర‌కుల్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫొటోకి ఫోజు ఇవ్వ‌గా.. ప్ర‌స్తుతం ఈ ఫొటో ఫ్యాన్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుంది. దీంతో ఫ్యాన్స్ సూప‌ర్ హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


    View this post on Instagram

    A post shared by Rakul Singh (@rakulpreet)




    కాగా ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ హిందీలో జాన్ అబ్ర‌హాం సర‌స‌న అటాక్, అర్జున్ క‌పూర్ స‌ర‌స‌న సర్దార్ అండ్ గ్రాండ్‌స‌న్ చిత్రాల్లో న‌టిస్తోంది. వాటితో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌న్ తెర‌కెక్కించ‌నున్న మే డేలో న‌టించ‌నుంది. ఇక తెలుగులో వైష్ణ‌వ్ తేజ్-క్రిష్ మూవీలో ర‌కుల్ న‌టించింది. ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల పూర్తి అయ్యింది. అలాగే నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెర‌కెక్కిస్తోన్న చెక్‌లో ర‌కుల్ న‌టిస్తోంది. వీటితో పాటు క‌మ‌ల్ హాసన్ ఇండియ‌న్ 2, శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ మూవీల్లో ర‌కుల్ యాక్ట్ చేస్తోంది. మొత్తానికి గ‌త రెండు సంవ‌త్స‌రాలు ర‌కుల్‌కి పెద్ద‌గా కలిసి రాన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీగా మారిపోయింది ర‌కుల్.
    Published by:Manjula S
    First published:January 06, 2021, 12:08 IST