రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బాధితుల కోసం ఏం చేసిందంటే..

Rakul Preet Singh: కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ కావడంతో ఆకలి చావులు కూడా నమోదవుతున్నాయి. అలాంటి వాళ్లకు అండగా నిలబడింది రకుల్. గుర్గావ్‌లోని తన ఇంటికి దగ్గర్లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 4, 2020, 2:01 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బాధితుల కోసం ఏం చేసిందంటే..
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
  • Share this:
ఇప్పటి వరకు కరోనా బాధితుల కోసం స్టార్ హీరోలతో పాటు కమెడియన్లు కూడా విరాళం అందించారు. ఎవరికి తోచినంత వాళ్లు ఇస్తూ వస్తున్నారు. కొందరు కోట్ల రూపాయలు ఇస్తుంటే.. మరికొందర తమకు ఉన్న దాంట్లో వేలల్లో కూడా సాయం చేస్తున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రణీత 50 కుటుంబాలకు అండగా నిలిచింది.. ఇక లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. వీళ్లు మినహా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్లెవ్వరూ ముందుకు రాలేదు. దీనిపై చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ ముందుకు వచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)


కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ కావడంతో చాలా మంది ఆకలి చావులు కూడా నమోదవుతున్నాయి. అలాంటి వాళ్లకు అండగా నిలబడింది రకుల్. గుర్గావ్‌లోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న 200 కుటుంబాలకు రోజూ రెండు పూటల అన్నం పెడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ లాక్ డౌన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తన చుట్టుపక్కల ఉన్న పేదవాళ్లకు తన తండ్రి గుర్తించి వాళ్లకు నిత్యం అన్నం పెడుతున్నాడని తెలిపింది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)

ఆ ఆహారాన్ని తింటూ ఉంటే వారి కళ్లలో వచ్చే ఆనందం చూస్తే అంత కంటే గొప్ప ఫీలింగ్ మరెక్కడా కనిపించదని చెబుతుంది రకుల్. మొత్తానికి తనకు తోచిన సాయం రకుల్ కూడా చేస్తుంది. మరోవైపు రష్మి గౌతమ్ కూడా ఇప్పటికే మూగ జీవాలతో పాటు బయట పేదవాళ్లకు కూడా అన్నం పెడుతుంది. మరి మిగిలిన ముద్దుగుమ్మలు ఎక్కడున్నారు..? వాళ్లు కూడా స్పందిస్తే బాగుంటుంది కదా అంటున్నారు అభిమానులు.
Published by: Praveen Kumar Vadla
First published: April 4, 2020, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading