HOME »NEWS »MOVIE »rakul preet singh gets offer to work with ajay devgan one more time after de de pyaar de sr here are the details gh

Rakul Preet Singh: రకుల్ పంట పండింది.. మరోసారి ఆ సీనియర్ నటుడితో రొమాన్స్ చేయనున్న హాట్ బ్యూటీ..

Rakul Preet Singh: రకుల్ పంట పండింది.. మరోసారి ఆ సీనియర్ నటుడితో రొమాన్స్ చేయనున్న హాట్ బ్యూటీ..
రకుల్ ప్రీత్ (File/Photo)

Rakul Preet Singh: ఫిలిం ఇండస్ట్రీలో అందం, అభినయం.. బ్యూటీ విత్ బ్రెయిన్ ఇలాంటివి అతికినట్టు సరిపోయేది ఎవరికంటే రకుల్ ప్రీత్ సింగ్ కే అని అత్యధికులు చెప్పడం ఖాయం.

  • Share this:
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న రకుల్ ప్రీత్ Rakul Preet Singhఏ క్యారెక్టరైనా ఇట్టే ఇరగీదీసే సత్తా తనకుందని చాటుకున్నారు. కానీ అందరు సౌత్ స్టార్స్ కు ఉన్నట్టే రకుల్ బాలీవుడ్ డ్రీమ్స్ మాత్రం ఎందుకో ఇప్పటికీ వర్కవుట్ కాలేదు. కానీ చూస్తుంటే కొత్త సంవత్సరం రకుల్ కు బాగా కలిసివస్తున్నట్టుంది. బాలీవుడ్ లో ఈమె పాగా వేయటం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్క్రీన్ పై తళుక్కుమనేందుకు .. మల్టీ స్టారర్, గెస్ట్ అప్పియరెన్స్, ఐటెం సాంగ్, హీరోయిన వంటి ఏ ఆఫర్ వచ్చినా ఎస్ చెబుతున్న రకుల్ కు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. ఆమధ్య డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వినిపించినా ఈమెపై ఎటువంటి మరకా పెద్దగా అంటుకోకపోవటానికి కారణం ఇదే. తాజాగా రకుల్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఇంద్ర కుమార్ "థాంక్ గాడ్" అనే మూవీ షూటింగ్ ఈనెల 21నుంచి మొదలుకానుంది. అజయ్ దేవగన్ (Ajay Devgn), సిద్దార్థ్ మల్హోత్రాలు (Sidharth Malhotra) నటిస్తున్న ఈ సినిమాను టీ సిరీస్ నిర్మిస్తోంది. గతంలోనూ టీ సిరీస్ నిర్మించిన "యారియాం" అనే సినిమాలో నటించిన రకుల్ కు ఆ సినిమాలో నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. కానీ సినిమా పెద్ద హిట్ కాకపోవటంతో అది ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు.

బాలీవుడ్ కొత్తేం కాదు కానీ..



ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రాతో "అయ్యారీ” ''మర్జావాం'', అజయ్ దేవ్ గన్ తో "దేదే ప్యారే దే"లో రొమాన్స్ చేసిన రకుల్ కు బాలీవుడ్ కామెడీ సినిమాల్లో నటించటం కొత్తేమీ కాదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "భారతీయుడు" సీక్వెల్ "ఇండియన్ 2”, క్రిష్ కొత్త సినిమా వంటి క్రేజీ సౌత్ ప్రాజెక్టుల్లో బిజీ స్టార్ గా.. రకుల్ లీడింగ్ స్టార్ గా తన స్థానం పదిలం చేసుకున్నారు. మరోవైపు జాన్ అబ్రహం సరసన "అటాక్" అనే మూవీ, "సర్దార్ అండ్ గ్రాండ్సన్" అనే బాలీవుడ్ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన నటిస్తున్న రకుల్.. "మేడే" లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్ గన్ తో కలిసి నటిస్తున్నారు. ఇక తాజాగా "థాంక్ గాడ్" Thank God మూవీ షూటింగ్ కూడా స్టార్ కావటంతో బాలీవుడ్ లో సక్సస్ఫుల్ గా రకుల్ సెకెండ్ ఇన్నింగ్స్ పట్టాలెక్కింది.
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)











View this post on Instagram






A post shared by Rakul Singh (@rakulpreet)






బిజీ సీనియర్ హీరోయిన్..

రకుల్ ప్రీత్ ప్రస్తుతం బిజీగా ఉన్న సీనియర్ హీరోయిన్లలో ఒకరుగా నిలుస్తున్నారు. అటు బాలీవుడ్ ఇటు దక్షిణాది సినిమాలతో ఆమె ఫుల్ దూకుడు మీద ఉన్నారు. నాలుగు హిందీ సినిమాలు ప్రస్తుతం ఈమె చేతిలో ఉండగా మరో రెండు పెద్ద బ్యానర్ సినిమాలు దక్షిణాది పరిశ్రమలో ఉండగా టాప్ హీరోయిన్ పొజిషన్ సైతం ఎంజాయ్ చేసిన రకుల్ 2021 అత్యంత బిజీ షెడ్యూల్ గడపనున్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఈ బ్యూటీ మంచి ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. ఇక బాలీవుడ్ సర్కిల్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్న రకుల్ ఎప్పటి నుంచో బాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుండగా తన పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడుతున్నా మంచి కమర్షియల్ హిట్ మాత్రం ఈమెకు ఇప్పటికీ లభించలేదు. దీంతో బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రకుల్ ను మరోసారి టీ సిరీస్ ఆదుకుంటుందేమో చూడాలి.
Published by:Suresh Rachamalla
First published:January 07, 2021, 14:09 IST