రకుల్ ప్రీత్ సింగ్ కొంప ముంచేసిన కరోనా వైరస్..

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఏడాది కింది వరకు కూడా వరస అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సత్తా చూపించింది. కానీ మన్మథుడు 2 తర్వాత..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 27, 2020, 9:11 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ కొంప ముంచేసిన కరోనా వైరస్..
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
  • Share this:
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఏడాది కింది వరకు కూడా వరస అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సత్తా చూపించింది. కానీ మన్మథుడు 2 తర్వాత తెలుగులో రకుల్‌ను పట్టించుకనే నాధుడే కరువయ్యాడు. ప్రస్తుతం నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఈ చిత్రం కూడా పూర్తైపోతే తెలుగులో ఈమెకు రిక్త హస్తాలే మిగిలిపోతాయి. అందుకే ముందు జాగ్రత్త పడింది ఈ ముద్దుగుమ్మ. అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా తనకంటూ ప్రత్యేకంగా బిజినెస్ ఏర్పాట్లు చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే తన పలుకుబడి వాడి జిమ్ బిజినెస్ మొదలు పెట్టింది.

రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)


ఈ మధ్యే ఫుడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాలని ఆలోచన చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు.. వైజాగ్‌లో ఒకటి.. బెంగళూర్‌లో ఒకటి ఎఫ్ 45 జిమ్ సెంటర్స్ రకుల్ నిర్వహిస్తుంది. లాక్ డౌన్ ముందు వరకు కూడా ఇవి కిక్కిరిసిపోయాయి. కోట్లకు కోట్ల టర్నోవర్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి లాక్ డౌన్ కారణంగా రకుల్ బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది. నెలన్నరగా అన్నీ మూత పడిపోవడంతో అమ్మడికి నష్టాలంటే ఎలా ఉంటాయో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)


పరిస్థితి చూస్తుంటే మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో తల పట్టుకుని కూర్చుంటుంది రకుల్. తనొక్కతే అయితే సరిపోదు కదా.. అందులో పని చేసే వాళ్లకు కూడా లక్షలకు లక్షలు జీతాలివ్వాల్సిందే.. దాంతో ఆర్థిక కష్టాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తుంది రకుల్. త్వరగా లాక్ డౌన్ అయిపోతే మళ్లీ పుంజుకోవాలని ఆమె ప్రయత్నిస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం అమ్మడి బిజినెస్‌కు భారీగానే కోత పడేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: April 27, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading