రకుల్ ప్రీత్ సింగ్ మనసులో మాట.. ఇంతకీ ఏం చెప్పిందంటే..

Rakul Preet | గత కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌కు  తెలుగు, తమిళంలో సరైన విజయాలు లేవు. తాజాగా నాగార్జున సరసన నటించిన ‘మన్మథుడు 2’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్దగా ఫలితం రాలేదు. తాజాగా ఈ భామ తన మనసులోని భావాలను మీడియాతో పంచుకుంది.

news18-telugu
Updated: August 16, 2019, 7:43 AM IST
రకుల్ ప్రీత్ సింగ్ మనసులో మాట.. ఇంతకీ ఏం చెప్పిందంటే..
instagram.com/rakulpreethsingh
news18-telugu
Updated: August 16, 2019, 7:43 AM IST
గత కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌కు  తెలుగు, తమిళంలో సరైన విజయాలు లేవు. తాజాగా నాగార్జున సరసన నటించిన ‘మన్మథుడు 2’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్దగా ఫలితం రాలేదు. తాజాగా ఈ భామ తన మనసులోని భావాలను మీడియాతో పంచుకుంది. సెలబ్రిటీ హోదాలో ఉన్న మా లాంటి వాళ్లు ఏ విషయం చెప్పినా.. క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతుంది. మా లాంటి కళాకారులకు సినిమా కంటే గొప్ప మాధ్యమం లేదు. మేము ఏం చెప్పాలనుకున్న సినిమా ద్వారానే చెబితేనే ప్రజలకు చేరువుతుంది. అలాంటపుడు మేము ప్రతి మాటనీ ఎంతో ఆచి తూచి మాట్లాడాలి. అంతేకాదు సినిమాల్లో మేము ఎంచుకునే కథలు, పాత్రలు కూడా మమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తుంటాయని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి మాట, సందేశం ఇవ్వాలనుకున్నపుడు సినిమాను మించిన సాధనం లేదంటోంది రకుల్. అందుకే స్క్రీన్ పై ఒక మాట మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తామని చెబుతుంది. ప్రస్తుతం ఈ భామ.. కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్2’లో ముఖ్యపాత్రలో నటిస్తోంది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించబోతున్న ‘దే దే ప్యార్ దే’  తెలుగు రీమేక్‌తో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ‘లాయర్’ పాత్ర చేయనున్నట్టు  సమాచారం.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...