మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సినీ సెలబ్రిటీలంతా ...తరలవచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు చూస్తుంటే... ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైట్‌లా ఉన్నాయన్నారు. శివాజీ రాజా, నరేష్ ఇద్దరు తమకు కావాల్సిన వాళ్లే అన్నారు రకుల్. మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు రావాలని కోరుకున్నారు రకుల్.
మధ్యాహ్నం 2 గంటల వరకు మా పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఫలితాలు ప్రకటించే అవకాశముంది. ఈసారి ఎన్నికల్లో సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా నటుడు నరేష్ బరిలో ఉన్నారు. శివాజీ రాజా ప్యానెల్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రాజీవ్ కనకాలు, నాగివీడు ఉన్నారు. నరేష్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివబాలజీ సహా 26 మంది ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చి పోలింగ్‌లో పాల్గొంటున్నారు.