మందుల కోసం బయటికి.. రకుల్ ప్రీత్ వీడియో వైరల్..

Rakul Preet Singh: లాక్‌డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఇంట్లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి ఢిల్లీ రోడ్లపై కనిపించింది. ప్రస్తుతం ఈమె వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన అభిమానులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 6, 2020, 8:57 PM IST
మందుల కోసం బయటికి.. రకుల్ ప్రీత్ వీడియో వైరల్..
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఇంట్లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి ఢిల్లీ రోడ్లపై కనిపించింది. ప్రస్తుతం ఈమె వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన అభిమానులు ఆమెనా కాదా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. మొహానికి మాస్క్ కట్టుకుని ఉన్న రకుల్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణ యువతిలా అలా వచ్చేసరికి ఎవరూ గుర్తు పట్టలేదు ముందు. గుర్తు పట్టేసరికి పని చూసుకుని వెళ్లిపోయింది రకుల్. ఓ మెడికల్ షాపుకి వచ్చి తనకు కావాల్సిన మందులను తీసుకుని వెళ్ళిపోయింది రకుల్. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రఫర్ ఈ వీడియోను షూట్ చేసాడు.

అతన్ని చూసిన వెంటనే వీడియో తీయొద్దంటూ వెళ్లిపోయింది రకుల్. ఆమె బయటికి వచ్చినపుడు కనీసం పక్కన కూడా ఎవరూ లేరు. ఒక్కతే అలా వచ్చేసి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పటికే ఈమె తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వందలాది కుటుంబాలకు రోజూ రెండు పూటల భోజనం పెడుతున్నట్లు చెప్పింది. అలాగే సిసిసికి విరాళం అందించింది. ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది రకుల్. తమిళనాట భారతీయుడు 2లో నటిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: May 6, 2020, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading