రకుల్ ప్రీత్ సింగ్‌కు సినిమాలు లేకపోయినా అలా చేస్తూ బతికేస్తుందిగా..

ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా తెలివిమీరిపోయారు. దీపం ఉన్నపుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఆ నాలుగు రాళ్లు తమ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 6:36 PM IST
రకుల్ ప్రీత్ సింగ్‌కు సినిమాలు లేకపోయినా అలా చేస్తూ బతికేస్తుందిగా..
రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)
  • Share this:
ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా తెలివిమీరిపోయారు. దీపం ఉన్నపుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఆ నాలుగు రాళ్లు కూడా రాని సమయంలో వచ్చిన రాళ్లను తమ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారు. రకుల్ కూడా ఇదే చేసిందిప్పుడు. స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ చక్రం తిప్పుతున్నా కూడా తనకు మంచి ఛాన్సులు వచ్చినపుడే ఆ డబ్బుతో బిజినెస్ మొదలుపెట్టింది రకుల్. జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు. F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Rakul Preet Singh busy with F 45 Gym business and posting her hot videos which is going viral pk ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా తెలివిమీరిపోయారు. దీపం ఉన్నపుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఆ నాలుగు రాళ్లు తమ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారు. Rakul Preet Singh,Rakul Preet Singh twitter,Rakul Preet Singh instagram,Rakul Preet Singh gym,Rakul Preet Singh gym workout,Rakul Preet Singh videos,Rakul Preet Singh hot,Rakul Preet Singh hot videos,Rakul Preet Singh hot scenes,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ జిమ్,రకుల్ జిమ్ వీడియోస్,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)

ఇప్పటికే చాలా మంది కొవ్వు కరిగించింది రకుల్. అవకాశాలు వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తుంది రకుల్. పనిలో పనిగా తన కొవ్వును కూడా ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూనే ఉంది ఈ భామ. తాజాగా మరో ఫిట్ నెస్ మంత్రతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రకుల్ ఫిట్ నెస్ చూసి ఏ ముద్దుగుమ్మకైనా కూడా కుళ్లు రావాల్సిందే. సినిమా సినిమాకు మరింత సన్నగా మారిపోయి అందరికీ షాక్ ఇస్తుంది ఈ బ్యూటీ. ఈ మధ్యే విడుదలైన మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో రకుల్ కెరీర్‌కు తెలుగులో పెద్ద దెబ్బే పడింది.


ప్రస్తుతం హిందీ, తమిళ్ భాషల్లో బిజీగా ఉంది రకుల్. ఈమెకు సినిమాలతో పాటు జిమ్ కూడా అంతే ఇష్టం. అందుకే ఇటు ఇండస్ట్రీతో పాటు బిజినెస్‌పై కూడా ఫోకస్ పెడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. యోగాలో కూడా ప్రవేశం ఉండటంతో ఎంతో కష్టమైన ఆసనాలను కూడా సులువుగా చేసేస్తుంది ఈ బ్యూటీ. దానికితోడు ఎప్పటికప్పుడు తన జిమ్, యోగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత హాట్ నెస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా సినిమాలు ఉన్నా లేకపోయినా రకుల్ మాత్రం హాయిగా బతికేస్తుంది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు