Rakul & Kajal : సూట్‌కేస్‌ సర్దేస్తున్న రకుల్, కాజల్..

Rakul & Kajal : శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా భారతీయుడు 2ను అదే కాంబీనేషన్‌లో తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి షూరూ అవనుంది.

news18-telugu
Updated: July 27, 2019, 8:55 AM IST
Rakul & Kajal : సూట్‌కేస్‌ సర్దేస్తున్న రకుల్, కాజల్..
రకుల్, కాజల్ Photo : Instagram
news18-telugu
Updated: July 27, 2019, 8:55 AM IST
శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’ ఈ సినిమా శంకర్, నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ఇండియన్, ఇదే సినిమాను తెలుగులో 'భారతీయుడు'గా పిలుస్తారు. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం..అంతేకాకుండా ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. దీంతో ఎలాగైనా.. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని డైరెక్టర్ శంకర్, నటుడు కమల్ హాసన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా 'భారతీయుడు 2' అనే సినిమాను కొన్ని నెలల కింద ప్రారంభించారు కూడా. దీని కోసం కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్‌కి, నిర్మాతకు కొన్ని విభేదాలు రావడంతో ఈ సినిమాను నిర్మిస్తున్న  లైకా ప్రొడక్షన్స్ సంస్థ 'భారతీయుడు 2' షూటింగ్‌ను నిలిపివేసింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఆగిపోయిందని అంతా అనుకున్నారు. అయితే, హీరో కమల్ హాసన్ చొరవ తీసుకొని ఈ సినిమా నిర్మాతను అలాగే దర్శకున్ని కలిసి.. 'భారతీయుడు 2' ఓ కొలిక్కి తీసుకొచ్చాడని టాక్. ఈ కారణంగానే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుందని సినీ పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.



 




Loading...

View this post on Instagram




 

The world will judge you on how you judge yourself so stand strong and chase those dreams ❤️ @sashajairam @im__sal @aliyashaik28


A post shared by Rakul Singh (@rakulpreet) on





అందులో భాగంగా  ఈ సినిమాలో కాజల్‌తో పాటు మరో హీరోయిన్‌గా చేస్తోన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ రాజమండ్రికి వెళ్లడానికి సూట్‌కేస్‌ సర్దుకుంటున్నారు. ఈ సినిమాలో కాజల్, కమల్ సరసన చేస్తుంటే.. హీరో సిద్ధార్థ్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారు. . ఈ సినిమా తాజా షెడ్యూల్‌ వచ్చే నెల 19న రాజమండ్రిలో ప్రారంభించడానికి ‘ఇండియన్‌ 2’ టీమ్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో రకుల్, కాజల్‌ ఇద్దరూ పాల్గొంటారని  తెలుస్తోంది. వీరితో పాటు  ప్రియా భవానీ శంకర్, ఐశ్వర్యా రాజేష్‌‌లు కీలకపాత్రలు చేస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.



 




View this post on Instagram




 

❤️ @vishalcharanmakeuphair @suzaneemmanuel @abhitabhkame


A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on




First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...