Rakul: 250 కుటుంబాలను దత్తత తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Sing | కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా మందికి పనిలేకుండా పోయింది. మరోవైపు దినసరి కూలీలకు ఈ లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంది.

news18-telugu
Updated: April 16, 2020, 7:44 AM IST
Rakul: 250 కుటుంబాలను దత్తత తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్..
రకుల్ ప్రీత్ Photo : Instagram
  • Share this:
కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా మందికి పనిలేకుండా పోయింది. మరోవైపు దినసరి కూలీలకు ఈ లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. వీరికి చేదోడు వాదోడుగా సినీ నటులు సెలబ్రిటీలు కూడా తమ వంతుగా పేదలను, సినీ కార్మికులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా బాధితుల కోసం హీరోలు, కమెడియన్లు, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలు అందజేయడంతో పాటు తమ వంతుగా సాయం చేస్తున్నారు.  కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. కానీ హీరోయిన్ ప్రణీత  మాత్రం 50 కుటుంబాలకు అండగా నిలిచింది. వాళ్లకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందిస్తోంది. ఇక లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అంతేకాదు కొన్ని మాస్కులు, శానిటైజర్లను పంచిపెట్టింది.  వీళ్లు మినహా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్లెవ్వరూ ముందుకు రాలేదు. దీనిపై చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ ముందుకు వచ్చింది.


కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రితో కలిసి గుర్గావ్‌లోని స్లమ్ ఏరియాలో ఉన్న 250 కుటుంబాలకు రెండు పూటల అన్నం పెడుతోంది. అంతేకాదు లాక్‌డౌన్ ఎఫ్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ వితరణ కొనసాగుతుందని చెబుతూ ఓ వీడియో విడుదల చేసింది. మరోవైపు హీరోయిన్ రష్మీ గౌతమ్ కూడా మూగ జీవాలకు తన వంతుగా సాయం చేస్తున్నారు. మొత్తానికి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాలా మంది కథానాయికలు ముందుకు రావడం మంచి పరిణామమే అని చెప్పాలి. వీళ్ల బాటలోనే చాలా మంది హీరోయిన్లు కూడా ముందుకు వస్తే బాగుందటుందనే వాళ్లు ఉన్నారు.

Published by: Kiran Kumar Thanjavur
First published: April 16, 2020, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading