RAKUL PREET SING PLAYS KABADDI WITH HER BROTHER POSTS A VIDEO ON INSTAGRAM SR
Rakul Preet Singh : కబడ్డీ ఆడుతోన్న రకుల్.. వీడియో వైరల్..
కబడ్డి ఆడుతున్న రకుల్ Photo : Instagram
కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో సినీ సెలెబ్రిటీస్ ఇంటి పట్టునే ఉంటూ తోచిన పనులు చేయడమే కాదు.. దానికి సంబందించిన వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్గన్తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ప్రస్తుతం రకుల్.. అజయ్‌తో 'థ్యాంక్యూ గాడ్' చిత్రంలోనూ నటిస్తోంది. అది అలా ఉంటే కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా ఈ భామ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంది. అందులో భాగంగా తాజాగా.. తన తమ్ముడు అమన్ తో కలిసి, చిన్నప్పుడు ఆడిన దిండూ దెబ్బ, కబడ్డీ, పులుసు ఆటలు ఆడుతోంది. దానికి సంబందించిన ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది రకుల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.