సూపర్ హిట్ సీక్వెల్‌లో రకుల్.. సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్..

Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది.

news18-telugu
Updated: April 10, 2020, 6:57 AM IST
సూపర్ హిట్ సీక్వెల్‌లో రకుల్.. సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్..
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
  • Share this:
Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. పక్కా కమర్షియల్‌ హంగులతోపాటు కంట తడిపెట్టించే భావోద్వేగ భరిత అనుబంధాల సందేశం ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. దీంతో ఈచిత్రానికి సీక్వెల్‌ని రూపొందించేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. ఈ సీక్వెల్‌లో కూడా మళ్ళీ అజయ్‌దేవగన్‌, రకుల్‌ కలిసి నటించబోతున్నారట. కాగా ప్రస్తుతం రకుల్.. అజయ్‌తో 'థ్యాంక్యూ గాడ్‌' చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో ప్రస్తుతం సరైన అవకాశాలు లేక సతమతమవుతున్న రకుల్‌కు ఇదో గొప్ప అవకాశం. ఈ సినిమా తర్వాత మళ్లి పుంజుకుని హిందీలో పాగా వెయాలనీ ఆశిస్తున్నారు ఆమె అభిమానలు. కాగా అజయ్ దేవగన్‌ ప్రస్తుతం ఈ చిత్రాలతో పాటు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న 'రౌద్రం రుధిరం రణం' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
Published by: Suresh Rachamalla
First published: April 10, 2020, 6:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading