వాటిని కిచిడిలాగా చేసి నెయ్యి వేసుకని తింటాను : రకుల్ ప్రీత్..

Rakul Preet Singh : రకుల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో ఉంటే తన రోజువారి డైట్ ఎలా ఉంటుందో చెప్పుకోచ్చింది.

news18-telugu
Updated: February 15, 2020, 3:40 PM IST
వాటిని కిచిడిలాగా చేసి నెయ్యి వేసుకని తింటాను : రకుల్ ప్రీత్..
Instagram/rakulpreet
  • Share this:
Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగులో ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన అందాల నటి. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను నటిస్తోంది. తెలుగు తెరకు ‘కెరటం’ అనే సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మొదటి హిట్ అందుకుని తెలుగు వారికి దగ్గరైంది. ఈ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో అవకాశాలు జోరుగా వస్తాయనుకుంటే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కాగా ఈ మధ్య రకుల్ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడింది. ‘నేను మాంసాహారాన్ని ప్రియంగా తింటాను. అలాగే నాకు శాకాహారం అంటే కూడా ఇష్టమే. కాకపోతే నా డైట్‌లో ఎక్కువు భాగం మాంసాహారం ఉండేది, ముఖ్యంగా కోడిగుడ్లును ఎక్కువగా తినేదాన్ని. అయితే అనుకోకుండా ఒకరోజు శాకాహారిగా మారాలనిపించింది. అనుకున్న వెంటనే మారిపోయాను. శాకాహారిగా మారిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉన్నాననిపిస్తోందని తెలిపింది. 

View this post on Instagram
 

Starve your distractions , feed your focus 💪🏻 Be your own Boss Lady ❤️ @mohitrai @ajiolife @shivangi.kulkarni @im__sal @ashisbogi


A post shared by Rakul Singh (@rakulpreet) on

షూటింగ్‌ సమయాల్లో ఫుడ్‌ విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అన్న ప్రశ్నకు సమాదానంగా రకుల్‌ స్పందిస్తూ.. ‘ముంబయిలో షూటింగ్‌ జరిగితే.. ఇంటి నుంచే పండ్లు, భోజనాన్ని తీసుకెళుతాను. అయితే షూటింగ్ విదేశాల్లో ఉన్నప్పుడు మాత్రం కొంత ఇబ్బంది పడుతుంటానని తెలిపింది. కారణం అక్కడ చేపలు, చికెన్‌ ఎక్కువగా దొరుకుతాయి. దీంతో అక్కడ ఏవైనా కూరగాయలు దొరికితే వాటిలో అన్నం, పప్పు వేసి కిచిడీలాగా చేసి నెయ్యి వేసుకొని తింటానని తెలిపింది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు