ఈ స్థానాన్ని చేరుకోవాడినికి ఎంతో కష్టపడాల్సీ వచ్చింది : రకుల్ ప్రీత్..

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రకుల్ మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

news18-telugu
Updated: June 25, 2020, 9:18 AM IST
ఈ స్థానాన్ని చేరుకోవాడినికి ఎంతో కష్టపడాల్సీ వచ్చింది : రకుల్ ప్రీత్..
రకుల్ ప్రీత్ Photo : Twitter
  • Share this:
Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అది అలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రకుల్ తాజాగా మాట్లాడుతూ.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ముంబైలోనే ఉండిపోయానని.. పరిస్థితులు కుదుటపడిన తర్వాత హైదరాబాదుకు వస్తానని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఇక్కడ దక్షిణాదిలో తాను పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయని.. ఓ హిందీ సినిమాకు కూడా సంతకం చేశానని తెలిపింది. ఇక తన జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలనీ.. ఆ లక్ష్యంతో తొమ్మిదేళ్ల క్రితం అమ్మానాన్నలను వదిలి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది. అయితే ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కాలం తర్వాత ఇప్పుడు అమ్మానాన్నలతో క్వాలిటీ టైమ్‌ను గడుపుతున్నానని తెలిపింది. అమ్మ నాన్నలతో ఉండడంతో మరోసారి బాల్యంలోకి అడుగుపెట్టినట్టు ఉందని.. తాను చేసిన వంటను రుచి చూసి చాలా బాగుందని అమ్మానాన్నలు మెచ్చుకుంటున్నారని.. ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ఈ భామ తెలుగులో నితిన్ సరసన చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2లో సినిమాలో నటిస్తోంది. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్ హీరోగా వస్తోన్న ఓ రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది
First published: June 25, 2020, 9:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading