వారానికి మూడుసార్లు ఇలా చేస్తే.. ఎంతో హాయి : రకుల్ ప్రీత్

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ భామ.. వారానికి మూడుసార్లు 108 సూర్య నమస్కారాలు చేస్తోందట.

news18-telugu
Updated: May 23, 2020, 2:09 PM IST
వారానికి మూడుసార్లు ఇలా చేస్తే.. ఎంతో హాయి : రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ Photo : Instagram
  • Share this:
Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. ‘కెరటం’ సినిమాతో పరిచయమై ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అది అలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ భామ.. 108 సార్లు సూర్య నమస్కారాలు చేస్తోందట. అంతేకాదు 108 సార్లు వారంలో రెండు మూడు సార్లు చేస్తోందట. ఈ సూర్య నమస్కారాల వల్ల తనకు ఎంతో హాయిగా ఉందని పేర్కోంది. మనస్సుతో పాటు శరీరం కూడా చాలా ఉత్సాహంగా తయారైందట. దీనికి సంబందంచిన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రకుల్. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ఈ భామ తెలుగులో నితిన్ సరసన చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2లో సినిమాలో నటిస్తోంది. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్ హీరోగా వస్తోన్న ఓ రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది.First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading