హోమ్ /వార్తలు /సినిమా /

హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు.. నిన్నే పెళ్లాడతా టీజర్ వదిలిన శ్రీకాంత్ అడ్డాల

హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు.. నిన్నే పెళ్లాడతా టీజర్ వదిలిన శ్రీకాంత్ అడ్డాల

Ninne Pelladatha news 18

Ninne Pelladatha news 18

అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ హీరో హీరోయిన్లుగా రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు నిర్మించిన చిత్రం ‘నిన్నేపెళ్లాడతా’. ఈ సినిమాను అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా వదిలారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అంబికా ఆర్ట్స్ (Ambika Arts), ఈశ్వరీ ఆర్ట్స్ (Eashwari Arts) పతాకాలపై వైకుంఠ్ బోను దర్శకత్వంలో అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ (Aman Sidhika Sharma) హీరో హీరోయిన్లుగా రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు నిర్మించిన చిత్రం ‘నిన్నేపెళ్లాడతా’ (Ninne Pelladatha). ఈ సినిమాను అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) చేతుల మీదుగా వదిలారు.

టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘నిన్నేపెళ్లాడతా.. ఆల్రెడీ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. ఈ టైటిల్‌తో కొత్త కథతో వస్తున్న టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారికి మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ.. ‘‘నిన్నేపెళ్లాడతా టీజర్‌ను విడుదల చేసి మా టీమ్‌ని ఆశీర్వదించిన శ్రీకాంత్ అడ్డాల గారికి ధన్యవాదాలు. చిత్రాన్ని అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు టీజర్ విడుదల చేశారు. నెక్ట్స్ వీక్ మరో గెస్ట్‌తో రొమాంటిక్ సాంగ్‌ని విడుదల చేయనున్నాం. విడుదలలోపు మ్యాగ్జిమమ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాం'' అన్నారు.

మరో నిర్మాత రమ్య రాజశేఖర్ మాట్లాడుతూ.. "స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గారి సోదరుడు అమన్ ఇందులో హీరోగా చేశారు. సిద్ధికా శర్మ హీరోయిన్. సాయికుమార్‌, ఇంద్రజ, అన్నపూర్ణమ్మ ఇలా సీనియర్ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఈ చిత్రంలో అమన్ , సిద్ధికా శర్మ, సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, అన్నపూర్ణమ్మ, విద్యుల్లేఖ రామన్, మధునందన్, సాయికిరణ్, గగన్ విహారి తదితరులు కీలకపాత్రలు పోషించగా.. నవనీత్ సంగీతం అందించారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Rakul Preet Singh, Srikanth Addala, Tollywood

ఉత్తమ కథలు