సిగరెట్ తాగడం సాధారణం : రకుల్ కామెంట్స్...

Rakul Preet Singh : మన్మథుడు 2 సినిమా ప్రమోషన్ కోసం రకుల్‌పై విడుదల చేసిన ఓ టీజర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వివాదస్పదమవుతోంది. ఆ ప్రమోషన్ వీడియోలో.. సిగరెట్‌ కాలుస్తూ బోల్డ్‌ డైలాగ్స్‌ చెప్పిన రకుల్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్‌ ఈ విషయంపై స్పందించారు.

news18-telugu
Updated: August 8, 2019, 8:01 AM IST
సిగరెట్ తాగడం సాధారణం : రకుల్ కామెంట్స్...
Photo : Instagram.com/rakulpreet
  • Share this:

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'మన్మథుడు 2' నటించిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా అప్పట్లో  సీనియర్ డైరెక్టర్ కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'మన్మథుడు' 2కు సీక్వెల్‌గా వస్తోంది.  ఈ తాజా సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో భాగంగా.. సినిమా ప్రమోషన్‌లో రకుల్‌కు సంబందించిన ఓ టీజర్‌ను చిత్ర బృందం విడదల చేసింది. ఆ ప్రమోషన్ వీడియోలో రకుల్ రచ్చ మామూలుగా లేదు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వివాదస్పదమవుతోంది. ఆ ప్రమోషన్ వీడియోలో.. సిగరెట్‌ కాలుస్తూ బోల్డ్‌ డైలాగ్స్‌ చెప్పిన రకుల్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్‌ ఈ విషయంపై మాట్లాడుతూ...‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్‌ కాల్చింది నేను కాదు.. అవంతిక. సిగరెట్‌ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. నా జీవితంలో నేను సిగరెట్‌ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్‌ సిగరెట్‌ కాల్చితే అదో పెద్ద టాపిక్‌ అవుతోంది అని పేర్కొన్నారు. అదే విధంగా సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ‘ సిగరెట్‌ కాల్చడం చాలా సాధారణ విషయం. మనం రోడ్డు మీద వెళ్తున్నపుడు కొంతమంది ఇలాంటి పనులు చేస్తే అస్సలు పట్టించుకోము. అదే తెరపై నటులు​ చేస్తే మాత్రం తప్పుగా చూస్తాం’ అని రకుల్‌ అన్నట్లుగా ఓ ఇంగ్లీష్ పత్రిక రాయడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె అసహనం వ్యక్తం చేశారు.అది అలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు రకుల్‌ ప్రీత్‌ను సరికొత్త లుక్‌ సూపర్ గ్లామర్ లుక్‌లో చూపించాడని.. ఎన్నడూ లేని విధంగా రకుల్ కూడా బోల్డ్ లుక్‌లో అదరగొట్టిందని ఫిలింనగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ సినిమా మొత్తం విదేశాల్లో షూట్ చేశారు. అందుకే అక్కడ నివసించే అమ్మాయి పాత్రను రకుల్ చేస్తోంది. దీంతో విదేశీ అమ్మాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో.. రకుల్‌ను అలాగే చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడట. ఇందులో భాగంగానే సిగరెట్ కాల్చడం, మందు తాగడం, బోల్డుగా మాట్లాడడం కూడా ఉంటుందని ఇప్పటికే టీజర్‌లో చూపించిన విషయం తెలిసిందే.


First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>