Rakshasudu Twitter Review : 'రాక్షసుడు' సినిమా ట్విట్టర్ రివ్యూ... ఎలా ఉందంటే..

Rakshasudu Twitter Review :  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'రాక్షసుడు' అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 'రాచ్చసన్' ను 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేశారు. ‘రాక్షసుడు’ సినిమాను ఓవర్సీస్‌లో చూసిన తెలుగువారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారేమంటున్నారో చూద్దాం..

news18-telugu
Updated: August 2, 2019, 10:48 AM IST
Rakshasudu Twitter Review : 'రాక్షసుడు' సినిమా ట్విట్టర్ రివ్యూ... ఎలా ఉందంటే..
Photo: Twitter.com/BSaiSreenivas
news18-telugu
Updated: August 2, 2019, 10:48 AM IST
Rakshasudu Twitter Review :  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. 'రాక్షసుడు' అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 'రాచ్చసన్' అనే సినిమాను 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ చేసింది. రమేష్ వర్మ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా శుక్రవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాక ముందే అమెరికాలో విడుదలైంది. మరీ ఈ 'రాక్షసుడు'‌ను అక్కడ చూసిన తెలుగువారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారేమంటున్నాో చూద్దాం.. అయితే ఈసారి బెల్లంకొండ గత సినిమాలతో పోలిస్తే ఈ 'రాక్షసుడు' ఆకట్టుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే  అంటున్నారు. దీనికి తోడు జిబ్రాన్ అందించిన సంగీతం కూగా అదిరిపోయిందని చెబుతున్నారు. ఈ సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయిని చెబుతున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను కిక్ ఎక్కించడం ఖాయం అంటున్నారు.

మొత్తానికి బెల్లంకొండ తొలిసారి హిట్ కొట్టబోతున్నట్టు సమాచారం. హీరో, విల‌న్ మ‌ధ్య సాగే మైండ్ గేమ్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో విలన్ పాత్ర హైలైట్ అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉందట. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 12.5 కోట్లకు.. శాటిలైట్ రైట్స్‌కు మరో 6 కోట్లు వచ్చాయి. దాంతో విడుదలకు ముందే చాలా వరకు సేఫ్ అయిపోయింది రాక్షసుడు.

Loading...











First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...