రివ్యూ: ‘రాక్షసుడు’.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నాళ్లో వేచిన ఉదయం..

5 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికే అరడజన్ సినిమాలు పూర్తి చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఇప్పటి వరకు ఆయన కోరుకున్న విజయం మాత్రం దోబూచులాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో పక్కా క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చాడు బెల్లంకొండ. మరి ఈ చిత్రంతో ఆయనేం మాయ చేసాడు..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 2, 2019, 2:05 PM IST
రివ్యూ: ‘రాక్షసుడు’.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నాళ్లో వేచిన ఉదయం..
రాక్షసుడు సినిమా ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, లక్ష్మి, బేబీ దివా తదితరులు
కథ, స్క్రీన్ ప్లే: రామ్ కుమార్

నిర్మాత: సత్యనారాయణ కోనేరు
దర్శకుడు: రమేష్ వర్మ

5 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికే అరడజన్ సినిమాలు పూర్తి చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఇప్పటి వరకు ఆయన కోరుకున్న విజయం మాత్రం దోబూచులాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో పక్కా క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చాడు బెల్లంకొండ. మరి ఈ చిత్రంతో ఆయనేం మాయ చేసాడు..?

కథ:
అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) దర్శకుడిగా మారాలనుకుంటాడు. కథ కూడా సిద్ధం చేసుకుంటాడు. కానీ నిర్మాతలు ఆయనకు ఛాన్స్ ఇవ్వరు. అదే సమయంలో బావ(రాజీవ్ కనకాల)సాయంతో చనిపోయిన తండ్రి ఎస్సై ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అరుణ్. ఆ సమయంలో సిటీలో వరసగా 15 నుంచి 16 ఏళ్ల అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేస్తుంటాడు ఓ సైకో. ఆ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు అరుణ్. అదే సమయంలో హత్యలు పెరుగుతుంటాయి. మరి ఆ కేసును అరుణ్ ఎలా చేధించాడు అనేది కథ. అసలు ఈయనకు కృష్ణవేణి(అనుపమ పరమేశ్వరన్)తో పరిచయం ఏంటి అనేది కథలో తెలుస్తుంది..కథనం:
క్రైమ్ థ్రిల్లర్స్ విషయంలో కథ చాలా సింపుల్. ఏదో మోటోతో ఓ కిల్లర్ వరస హత్యలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. స్క్రీన్ ప్లేతోనే ఈ కథలన్నీ నడుస్తుంటాయి. ముఖ్యంగా క్లూ లేకుండా మర్డర్స్ జరుగుతుంటే పోలీసులు కూడా మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంటారు. ఆ సమయంలో హీరో వచ్చి కేస్ క్లోజ్ చేస్తాడు. రాక్షసుడు కూడా ఇలాంటి కథే. కథలో కొత్తదనం కనిపించకపోయినా కూడా స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీల్ వస్తుంది. ఫస్ట్ సీన్‌లోనే మర్డర్ షాట్‌తో ఓపెన్ చేయడం.. ఆ తర్వాత వరస హత్యలు చేసి పోలీసుల్లో మరింత కసి పెంచడం ఇవన్నీ ఆసక్తి పుట్టిస్తాయి.

సీన్ సీన్‌కు ఉత్కంఠ పెంచుకుంటూ పోయాడు దర్శకుడు. ఒకే రకంగా మర్డర్స్ జరుగుతున్నా కూడా నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ అయితే పెంచేసాడు దర్శకుడు రమేష్ వర్మ. ఇంటర్వెల్ తర్వాత హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత కూడా పేస్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. క్లైమాక్స్ వరకు కూడా అదే టెంపో కొనసాగిస్తూ అద్భుతమైన థ్రిల్లర్ చూసిన ఫీల్‌తో సినిమాను ముగించేసారు. ముఖ్యంగా హంతకుడు ఎందుకు సైకోగా మారాడనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా రీమేక్ సినిమా అయినా కూడా ఒరిజినల్ చూడని వాళ్ళు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్ బాగా నటించాడు. సీత సినిమాలో ఈయన నటనకు విమర్శలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం పోలీస్ ఆఫీసర్ పాత్రలో పర్లేదనిపించాడు. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాలేమో..? అనుపమ పరమేశ్వరన్ బాగుంది. కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినా కూడా అద్భుతంగా నటించింది. రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత గుర్తుండిపోయే పాత్ర చేసాడు. మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ పాత్రలన్నీ బాగున్నాయి. చిన్న పాప దివా కూడా బాగా చేసింది. మొత్తానికి ఒరిజినల్ ఫీల్ పోకుండా ఎక్కువ మంది తమిళ వాళ్లనే తీసుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ.

టెక్నికల్ టీం:
ఈ సినిమాలో పాటలకు స్కోప్ లేదు. అయినా కూడా రెండు పాటలు సందర్భానుసారంగానే వస్తాయి. జిబ్రన్ దీనికి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక రెండున్నర గంటల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎడిట్ చేసారు. దర్శకుడు రమేష్ వర్మ అయినా కూడా ఒరిజినల్ చేసింది మాత్రం రామ్ కుమార్. అక్కడ్నుంచి ఈయన స్క్రీన్ ప్లే తీసుకున్నాడు. ఇటుక పేర్చినట్లు ప్రతీ సీన్ కనెక్టింగ్‌గా రాసుకున్నాడు రామ్ కుమార్. తెలుగులో దాన్ని మార్చకుండా అలాగే తీసేసారు.

చివరగా ఒక్కమాట:
రాక్షసుడు.. ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్..

రేటింగ్: 3/5
Published by: Praveen Kumar Vadla
First published: August 2, 2019, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading