ఉర్ఫీ జావెద్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హిందీలో జరిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంటుంది. తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో మంటలు రేపేస్తోంది. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. ఈమె డ్రెస్సులు,వీడియోలు చూసిన నెటిజన్స్ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం డ్రెస్సింగ్ అంటూ... నిత్యం ఉర్ఫీని ట్రోల్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆమె వేసుకునే దుస్తులను చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్ చేస్తారా ? అవేం డ్రెస్సులురా బాబూ.. అని చాలామంది సిగ్గుతో తలదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
View this post on Instagram
అయితే ఈ మధ్య ఉర్ఫీతో కలిసి రాఖీ సావంత్ కూడా హల్ చల్ చేస్తుంది. ఏదానా ఈవెంట్లలో వీరిద్దరూ ఎదురు పడితే.. ఒకరునొకరు కౌగిలించుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి ప్రవర్తన, డ్రెస్సింగ్ పై భయంకరమైన కామెంట్లు చేస్తున్నా నెటిజన్స్. తాజాగా ఓ ఈవెంట్లో కలిసిన వీరిద్దరూ... మరోసారి హల్ చల్ చేశారు. ఉర్ఫీ వైట్ కలర్ డ్రెస్సులో కనిపించగా.. రాఖీ సావంత్ బ్లాక్ డ్రెస్‌లో వచ్చింది. దీంతో రాఖీ.. ఉర్ఫీ బుగ్గపై ముద్దాడింది. ఈ వీడియోను ప్రముఖ ఫోటోగ్రామర్ వైరల్ భయాని.. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్స్ వీరిద్దరిపై ఘోరమైన కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం సర్కస్‌లో ఇద్దరు జోకర్లు అంటూ ట్రోల్ చేస్తున్నారు.సర్కస్‌లో ఉన్నవాళ్లు... బయట తిరుగుతన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరొ నెటిజన్ అయితే.. వీరి ముద్దు వీడియో చూసి.. లెస్బియన్ కలినప్పుడు..అంటూ స్మైలీ ఎమోజీని పోస్టు చేశాడు. మరో నెటిజన్ ఇలాంటి వీడియోలు ఎందుకు పోస్టు చేస్తారు అని అడుతున్నాడు. మరో నెటిజన్ ఆమె అందంగానే ఉంది.. కానీ ఆమె డ్రెస్ మాత్రం వల్గర్‌గా ఉందన్నాడు. మరో నెటిజన్ వీరిద్దరూ త్వరలో సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో నటిస్తారని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద రాఖీ, ఉర్ఫీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Rakhi Sawant