సుడిగాలి సుధీర్ కు రాకేష్ మాస్టర్ హెచ్చరిక ఇదే...శేఖర్ మాస్టర్ విషయంలో షాకింగ్ కామెంట్స్...

సుడిగాలి సుధీర్, రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్

సుధీర్ ఆచి తూచి అడుగు వేయాలని ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సూచిస్తున్నారు. అయితే ఢీ షోలో తనదైన స్థానం సంపాదించిన సుధీర్ అందులో రాజకీయాలకు బలికావద్దని, ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ హెచ్చరించారు.

  • Share this:
    జబర్దస్త్ స్టేజీ నుంచి వెండితెరపై హీరో రేంజికి ఎదిగిన సుడిగాలి సుధీర్ అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజానికి సుధీర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి అని పేరుంది. హీరో అయినప్పటికీ జబర్దస్త్ మాత్రం వదలకుండా అందులోనే కంటిన్యూ అవ్వడం సుధీర్ మంచితనానికి ప్రతీకగా చెబుతుంటారు. అటు సినిమాల్లో సైడ్ కేరక్టర్ల స్థాయి నుంచి ఇప్పుడు సుధీర్ హీరోగా రెండు సినిమాలు పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే సుధీర్ చేసిన సినిమాలు టెక్నికల్ వేల్యూస్ పరంగా చూసినా, సబ్జెక్ట్ పరంగా చూసినా నాసిరకం చిత్రాలే అని చెప్పాలి. కానీ సుధీర్ ఉండటం వల్ల ఆ సినిమాలు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. అయితే సుధీర్ కనుక కాస్త కాన్సెట్రేషన్ చేసి మంచి సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటే, ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పుడే సుధీర్ ఆచి తూచి అడుగు వేయాలని ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సూచిస్తున్నారు. అయితే ఢీ షోలో తనదైన స్థానం సంపాదించిన సుధీర్ అందులో రాజకీయాలకు బలికావద్దని, ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ హెచ్చరించారు. ఢీలో తనకు సుడిగాలి సుధీర్ అంటే ఇష్టమని, అయితే అందులో కొందరు మేకవన్నె పులులు ఉన్నాయని, వారితో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

    అంతేకాదు శేఖర్ మాస్టర్ విషయంలో కూడా రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర విద్య నేర్చుకున్న శేఖర్ ప్రస్తుతం టాప్ పొజిషన్ వెళ్లిన తర్వాత తనను పట్టించుకోవడం మానేశాడని, ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలతో తాను కలత చెందినట్లు తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే మంచి స్థాయిలో రాణిస్తున్న సుడిగాలి సుధీర్ మేక వన్నె పులులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
    Published by:Krishna Adithya
    First published: