హోమ్ /వార్తలు /సినిమా /

అరేయ్ జప్ఫా హైపర్ ఆది అంటూ రాకేష్ మాస్టర్ వార్నింగ్..

అరేయ్ జప్ఫా హైపర్ ఆది అంటూ రాకేష్ మాస్టర్ వార్నింగ్..

హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ (hyper aadi rakesh master)

హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ (hyper aadi rakesh master)

Hyper Aadi: కాంట్రవర్సీలోనే కామెడీని వెతుక్కుంటాడు జబర్దస్త్ కమెడియన్ హైప‌ర్ ఆది. ట్రెండింగ్‌లో ఉన్న వాళ్లను పట్టుకుని వాళ్లపై అదిరిపోయే పంచులు వేస్తుంటాడు. అవి కాస్తా ఒక్కోసారి..

కాంట్రవర్సీలోనే కామెడీని వెతుక్కుంటాడు జబర్దస్త్ కమెడియన్ హైప‌ర్ ఆది. ట్రెండింగ్‌లో ఉన్న వాళ్లను పట్టుకుని వాళ్లపై అదిరిపోయే పంచులు వేస్తుంటాడు. అవి కాస్తా ఒక్కోసారి భారీగా పేలుతుంటాయి.. మరోసారి మాత్రం దారుణంగా బుక్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రతీసారి తన పంచులతో నవ్వించే హైపర్ ఆదిని ఇప్పుడు సీనియర్ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ బూతులతో రెచ్చిపోయాడు. అరేయ్ జప్ఫా అంటూ మొదలుపెట్టాడు ఈయన. శేఖర్ మాస్టర్ గురువుగా ప్రేక్షకుల్లో ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అందర్నీ టార్గెట్ చేస్తూ ఈ మధ్య యూ ట్యూబ్‌లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ (hyper aadi rakesh master)
హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ (hyper aadi rakesh master)

అలాగే ఓసారి అన్నయ్యకు పెళ్లంట అంటూ సాంగ్ పాడి కొరియోగ్రఫీ చేసి చూపించాడు రాకేష్. దాన్ని హైపర్ ఆది పేరడీ చేసాడు. మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ప‌లికించేవాళ్లు అప్పటి నటులు.. తాము అప్పుడు కొరియోగ్రఫీ ఎలా చేసేవాళ్లమో చూపించడానికి చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్య సంబరం అంటా అంటూ రాకేష్ మాస్టర్ మాట్లాడిన వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దాన్ని తన స్కిట్ కోసం పేరడీ చేసాడు హైపర్ ఆది. ఈటీవీలో ఈ మధ్యే వచ్చిన పండగ సార్ పండగ అంతే అనే ఈవెంట్‌లో సెటైరిక‌ల్‌గా వేసాడు.

తనను ఎవరూ ఏం అనకపోయినా కూడా రెచ్చిపోయే రాకేష్ మాస్టర్.. తననే వెక్కిరించే సరికి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. నాపైనే కామెడీ చేస్తావా..?..దొరుకుతావురా తుపాకీ.. అప్పుడు నీకు ఉంటుందిరా ఆదీ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. జప్ఫా హైపర్ ఆది అంటూ రెచ్చిపోయాడు ఈయన. మంచి మ‌న‌సు ఉండాల‌ని.. తాను బూతులు మాట్లాడినా.. యోగి వేమ‌నలా ఉంటుందని.. కానీ ఆది చేసేది మాత్రం క‌మ‌ర్షియ‌ల్ బిజినెస్ అని చెప్పుకొచ్చాడు. త్వ‌ర‌లోనే గొడ్డలిపెట్టు పడపోతుంది అంటూ ఆదికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు రాకేష్ మాస్టర్. మరి దీనిపై హైపర్ ఆది ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలిక.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు