Rakesh Master: రాకేష్ మాస్టర్ ఇంటిపై దాడి.. అలా మాట్లాడి మనోభావాలు దెబ్బతీసినందుకే ఇలా?

rakesh master

Rakesh Master: టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీలో, బయట సమాజంలో ముక్కుసూటి మనిషి గా నిలిచాడు

  • Share this:
    Rakesh Master: టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీలో, బయట సమాజంలో ముక్కుసూటి మనిషి గా నిలిచాడు. కానీ వాటి వల్లే తరచు వివాదాలను ఎదుర్కొంటాడు. ఆయన శిక్షణలో ఎంతోమంది శిష్యులను కొరియోగ్రాఫర్ గా మార్చాడు. ఇక ఈయన బయట జరిగే కొన్ని సంఘటనలకు బాగా రియాక్ట్ అవుతాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన పై కొందరి మనోభావాలు దెబ్బ తినడంతో కేసు వేసిన ఘటన చోటుచేసుకుంది.

    తన ఫేస్ టు ఫేస్ మాటలతోనే వివాదాల్లోకి దిగుతున్న రాకేష్ మాస్టర్.. గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణుడి పై కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం దాని గురించి రాకేష్ మాస్టర్ పై కేసు నమోదయ్యింది. 9 నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో యాదవుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక అవి వివాదానికి దారితీశాయి. శ్రీకృష్ణుడి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ మనోభావాలు దెబ్బతీశారంటూ యాదవ హక్కుల పోరాట సమితి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీంతో శ్రీ కృష్ణ నగర్ లో నివసించే రాకేష్ మాస్టర్ ఇంటికి ఆదివారం సాయంత్రం 5:30 కు సాయి యాదవ్, ఇమ్రాన్ తదితరులు తన ఇంట్లోకి ప్రవేశించి అతడిని దూషించడంతో పాటు అతని ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేశారు. దీంతో ఆ రోజు రాత్రి రాకేష్ మాస్టర్ తనపై దాడి చేసిన వారిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. శ్రీ కృష్ణుడుపై దుర్భాషలాడిన రాకేష్ మాస్టర్, ఆ సమయంలో అతని వెంట ఉన్న తన భార్య, వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వారిపై కూడా కేసు నమోదు చేయాలంటూ యాదవుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా రాకేష్ మాస్టర్ పై కూడా కేసు నమోదు చేశారు.
    Published by:Navya Reddy
    First published: