Raju Gari Gadhi 3 Review: రాజు గారి గది 3 మూవీ రివ్యూ.. నవ్వించిన దెయ్యం..

Raju Gari Gadhi 3 Review: రాజు గారి గది 3 మూవీ రివ్యూ.. నవ్వించిన దెయ్యం..

రాజు గారి గది 3 మూవీ కలెక్షన్స్ (Twitter/Photo)

తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఇప్పుడు సీక్వెల్స్ హ‌వా న‌డుస్తుంది. సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా వాటి కొన‌సాగింపు క‌థ‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు ద‌ర్శ‌కులు. తాజాగా ఓంకార్ ‘రాజు గారి గది 3’ మూవీతో పలకరించాడు.ఈ మూవీతో ఓంకార్ హిట్టు అందుకున్నాడా లేదా చూద్దాం..

  • Share this:
నటీనటులు: అశ్విన్ బాబు, అవికా గోర్,ఆలీ, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, ఊర్వశి తదితరులు..

సంగీతం : షబీర్

సినిమాటోగ్రఫీ: చోటా కే.నాయుడు

నిర్మాణం, దర్శకత్వం: ఓంకార్

తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఇప్పుడు సీక్వెల్స్ హ‌వా న‌డుస్తుంది. సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా వాటి కొన‌సాగింపు క‌థ‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు ద‌ర్శ‌కులు. ఇప్పుడు కూడా రాజుగారిగ‌ది సీక్వెల్ చేసాడు ఓంకార్. ఇప్ప‌టికే తొలి భాగం హిట్టైనా కూడా రెండో భాగం ఫ్లాప్ అయింది. నాగార్జున హీరోగా స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన రాజుగారిగ‌ది 2 అంచ‌నాలు అందుకోలేదు. ఇపుడు తన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అవికా గోర్ హీరోయిన్‌గా రాజు గారి గది 3 వచ్చింది. మరి ఈ సినిమాతో ఓంకార్ మరో హిట్టు అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

హీరో అశ్విన్ బాబు ఒక ఆటో డ్రైవర్. తను కాలనీలో ఉండేవాళ్లకు ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అతనికి హీరోయిన్ డాక్టర్ మాయ (అవికా గోర్) పరిచయమవుతోంది. మాయను ఎపుడు ఒక దెయ్యం వెంటాడుతూ ఉంటుంది. ఆమెను ప్రేమ అన్నవాళ్ల భరతంపడుతూ ఉంటుంది.  ఈ సందర్భంగా ఒక ఘటనలో అశ్విన్ బాబు, హీరోయిన్ మాయతో కలుస్తాడు. ఆ తర్వాతఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.  ఇక మాయను ఎపుడు నీడలా వెంటాడే ఆ దెయ్యం అశ్విన్ బాబు ఏం చేసిందనేదే రాజు గారి గది 3 స్టోరీ. 

నటీనటుల విషయానికొస్తే..

రాజు గాది గది సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.. ఆ తర్వాత రాజుగారి గది 2తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలో ఓంకార్ తన తమ్ముడు ఓంకార్‌ను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక అశ్విన్ బాబు కూడా తన పరిధిలో బాగానే నటించాడు. చాలా రోజుల తర్వాత అవికా గోర్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఒక్క క్లైమాక్స్ సీన్ తప్పించి అవికా గోర్‌కు పెద్దగా నటించే ఛాన్స్ దొరకలేదు. మరోవైపు ఆలీ, బ్రహ్మాజీ కామెడీ బాగుంది. ఇక సెకండాఫ్‌లో అజయ్ ఘోష్, ఊర్వశిల నటన ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.

టెక్నీకల్ విషయానికొస్తే..

స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్‌బాస్‌కు డైరెక్టర్‌గా ప్రమోషన్ అందుకున్న ఓంకార్.. తనకు తొలిసారి హిట్టిచ్చిన రాజు గారి గది అనే హార్రర్ కామెడీని నుంచి ఇంకా బయటకు రాలేనట్టు కనబడుతోంది. తొలి పార్ట్‌లో కామెడీతో గట్టెక్కిన ఓంకార్.. రెండో భాగంలో అంతగా కామెడీని పండించలేకపోయాడు. అందుకే ఇపుడు మూడో భాగానికి ఎక్కువగా హార్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు కేరళను బ్యాక్ గ్రౌండ్‌గా ఎంచుకోవడం.. అక్కడ మంత్ర తంత్రాలు క్షుద్రశక్తులను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. ముఖ్యంగా ఇక్కడ కూడా ఒక రాజు గారు తన కూతురు‌ను వేధిస్తున్న ఒక బ్రిటిష్ అధికారిని మట్టుపెట్టుడానికి ఒక యక్షణి దెయ్యాన్ని ప్రయోగిస్తాడు. ఆ తర్వాత దాన్ని ఒక మహల్‌ (రాజు గారి గది)లో బంధిస్తాడు ఆ రాజు.  ఆ  దెయ్యానికి ప్రస్తుత కాలానికి లింకు పెట్టి ఈ కథను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు ఓంకార్. దెయ్యాలతో కామెడీ చేయించడం కొంచెం అతిగా ఉంది. కానీ కథలో భాగంగా వచ్చే కామెడీలో అది కలిసిపోయింది. ఇంకోవైపు ఒక ఆటో డ్రైవర్‌ను డాక్టర్ ప్రేమించడమనేది కన్విన్సింగ్‌‌‌గా అనిపంచదు. మొత్తంగా హార్రర్ కామెడీతో ఓంకార్ భయపెట్టేకన్న.. నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. చోటా కే.నాయుడు కెమెరా పనితనం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఎడిటర్ తన కత్తెరకు బాగానే పని చెప్పాడు. అనవసర సీన్స్ లేకుండా ఉన్నంతలో చక్కగా ఎడిటింగ్ చేసాడు.  షబీర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తానికి లాజిక్కులు పక్కనపెడితే... రాజు గారి గది 3 ప్రేక్షకులను అంతగా డిసపాయింట్ చేయదనే చెప్పాలి. 

ప్లస్ 

కామెడీ

నిర్మాణ విలువలు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్

రొటిన్ స్టోరీ

పాటలు

లవ్ ట్రాక్

రేటింగ్: 2.5/5

మొత్తానికి మాస్‌ను మెప్పించే హార్రర్ కామెడీ 
First published: