అనారోగ్యం నుంచి కోలుకున్న విజయ్ కాంత్...రజనీకాంత్ పరామర్శ

అమెరికాలో నెల రోజుల చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి విజయ్ కాంత్ కోలుకుంటున్నారు. చెన్నై చేరుకున్న ఆయన్ను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు.

news18-telugu
Updated: February 22, 2019, 3:26 PM IST
అనారోగ్యం నుంచి కోలుకున్న విజయ్ కాంత్...రజనీకాంత్ పరామర్శ
విజయ్ కాంత్‌కు రజనీకాంత్ పరామర్శ
  • Share this:
అనారోగ్యం నుంచి కోలుకుంటున్న తమిళ సీనియర్ నటుడు, డిఎండికె అధినేత విజయ్ కాంత్‌ను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. చెన్నై సాలిగ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి విజయ్ కాంత్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ కాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. విజయ్ కాంత్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అమెరికాలో నెల రోజుల వైద్య చికిత్స తర్వాత కోలుకున్న విజయకాంత్...గతవారం చెన్నై తిరిగొచ్చారు. ఈ సందర్బంగా రజనీకాంత్ ఆయన ఇంటికెళ్లి విజయ్ కాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ విజయ్ కాంత్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

rajnikanth, vijayakanth, dmdk, tamil cinema news, rajnikanth vijayakanth, విజయ్ కాంత్, రజనీకాంత్, డీఎండీకే, తమిళనాడు రాజకీయాలు, తమిళ సినిమా
విజయ్ కాంత్‌కు రజనీకాంత్ పరామర్శ


అనారోగ్యంతో తాను రామచంద్ర ఆసుపత్రిలో చేరినప్పుడు తనను పరామర్శించేందుకు వచ్చిన మొదటి వ్యక్తి విజయ్‌కాంత్‌ అని రజనీకాంత్ గుర్తు చేశారు.

rajnikanth, vijayakanth, dmdk, tamil cinema news, rajnikanth vijayakanth, విజయ్ కాంత్, రజనీకాంత్, డీఎండీకే, తమిళనాడు రాజకీయాలు, తమిళ సినిమా
విజయ్ కాంత్‌కు రజనీకాంత్ పరామర్శ
విజయ్ కాంత్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడే కలవాలనుకున్నా.. కానీ కుదరలేదన్నారు. ఇప్పుడు అనారోగ్యం నుంచి కోలుకున్న విజయ్ కాంత్ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. విజయ్ కాంత్‌తో రాజకీయాల గురించి మాట్లాడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
First published: February 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు