Home /News /movies /

RAJKUNDRA GIVES LUXURY VANITY VAN AS A BIRTHDAY GIFT TO BOLLYWOOD ACTRESS SHILPA SHETTY SNR

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బర్త్‌ డేకి భారీ గిఫ్ట్ ఇచ్చిన భర్త .. వీడియో ఇదిగో చూడండి

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టికి అదిరిపోయే బర్త్‌ డే గిఫ్ట్ ఇచ్చారు భర్త రాజ్‌కుంద్రా. షూటింగ్, అవుట్‌ డోర్‌కి వెళ్లేందుకు సౌకర్యంగా ఉండే లగ్జరీ వ్యాన్‌ని డిజైన్ చేయించారు. ఇందులో లగ్జరీతో పాటు ఫిట్‌నెస్‌ కేర్ కోసం స్పెషల్‌గా యోగా డెక్‌ని డిజైన్ చేయించారు రాజ్‌కుంద్రా.

ఇంకా చదవండి ...
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa Shetty)కుంద్రా బర్త్‌ డే గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ యోగా బ్యూటీకి భర్త రాజ్‌కుంద్రా(Rajkundra)అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry)లోని చాలా మంది స్టార్స్‌కి షూటింగ్‌(Shooting)‌లకు, అవుట్‌ డోర్‌ స్పాట్‌కి వెళ్లడానికి ప్రత్యేకమైన వ్యాన్‌లు ఉన్నాయి. కాని శిల్పశెట్టి ఇప్పటి వరకు కార్లు మాత్రమే ఉపయోగిస్తూ వచ్చారు. కాని ఈ బర్త్‌ డేకి గిఫ్ట్‌గా భర్త రాజ్‌ కుంద్రా రీసెంట్‌గా చేయించి వానిటీ వ్యాన్‌(Vanity van‌)ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

లగ్జరీ వ్యానిటీ వ్యాన్..
ఎంతో విలాసవంతమైన యోగా కార్నర్‌తో కూడిన సూపర్ లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ ఖరీదు బయటపెట్టకుండా కేవలం వీడియోని మాత్రమే షేర్ చేశారు. పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ వ్యానిటీ వ్యాన్ అత్యంత విలాసవంతంగా రూపొందించమే కాకుండా యోగా, ఎక్స్‌ర్‌సైజ్‌ చేసుకునేందుకు ప్రత్యేక మైన బోర్డ్ కూడా ఇందులో డిజైన్ చేయబడి ఉంది. శిల్పాశెట్టికి యోగా అంటే ప్రాణం కాబట్టి భర్త రాజ్‌కుంద్రా లగ్జరీ, ఫిట్‌నెస్‌ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యానిటీ వ్యాన్‌ని వైఫ్‌కి గిఫ్ట్‌గా అందజేశాడు.
అదిరిపోయే ఫీచర్స్ ..
వ్యాన్‌ ఫ్రంట్‌ సైడ్ ఫుల్ గ్లాస్‌తో కవర్ చేసినట్లు ఉంది. రెండు చివర్లో హాలోజన్ లైట్లకు మధ్యలో గ్రిల్ ఉండేలా డిజైన్ చేశారు. ఈ వ్యానిటీ వ్యాన్‌పై శిల్పాశెట్టి కుంద్రా అనే పేరును షార్ట్‌కట్‌లో ఎస్ఎస్‌కే అనే అక్షరాలను ఉంచారు. ఈ లగ్జరీ వ్యాన్‌ బయట నుంచి అందంగా కనిపిస్తుంటే ...లోపల సౌకర్యాలు మరింత అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ వ్యానిటీ వాన్‌లో స్టార్‌ హోటల్‌లో సూట్‌ రూమ్‌ని తలదన్నే విధంగా క్యాబిన్‌, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి స్మాల్ కిచెన్, రెస్ట్ తీసుకోవడాని లాంజ్ హెయిర్, మేకప్ కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ చేయించారు. ఇందులో అన్నీ రకాల స్పా, సెలున్‌ మెటిరియల్స్ ఉంచారు. ఒక మనిషి ఎన్ని రోజులైన ఈ వ్యాన్‌లో నివాసం ఉండే విధంగా డిజైన్ చేశారు. వంటగదిలో మైక్రోవేవ్ ఓవెన్, చిమ్నీ, కూరగాలు కట్ చేసుకునేందుకు కట్టర్‌తో పాటు సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా వుడెన్‌ అల్మర ఉంది. వ్యాన్‌ లాంజ్‌ని ఎల్‌ షేప్‌తో కూడినట్లుగా డిజైన్ చేశారు. ఫుల్లీ ఎయిర్‌ కండీషన్డ్‌తో లేటెస్ట్‌ మోడల్ సోఫాలు, చైర్‌లు, డెస్క్, కుషన్‌లు, పెద్ద అద్దంతో పాటుగా రూఫ్ మౌంటెడ్ లైట్లతో ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది.

ఇది చదవండి: నయనతారకు ముద్దు పెడుతూ.. పెళ్లి ఫోటో షేర్ చేసిన విఘ్నేశ్ శివన్భార్య సౌఖ్యం కోసం..
గ్రాండ్ లుక్, లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్న ఈ వ్యానిటీ వ్యాన్‌లో అన్నింటి కంటే స్పెషల్‌గా డిజైన్ చేయబడింది ఫిట్‌నెస్ కోసె యోగా డెక్. వ్యాన్‌ లాంజ్‌లోంచి పైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. పైన ఆర్టిఫీషిల్ గడ్డితో నీట్‌గా పరిచినట్లుగా ఉంది. ఫ్లోర్‌లో యోగా మ్యాట్, ఫోల్డబుల్ కుర్చీతో పాటు డంబెల్స్ ఉన్నాయి. క్యాబిన్ లోపల ఉన్న చిన్న మెట్ల ద్వారా ఈ యోగా డెక్‌కి చేరుకునేలా డిజైన్ చేశారు. భార్య షూటింగ్‌లు, యోగా సెషన్స్‌కి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ విధంగా వ్యాన్‌ని డిజైన్ చేయించారు రాజ్‌కుంద్రా. ఇప్పటి వరకు శిల్పాశెట్టికి ఉన్న అత్యంత ఖరీదైన వస్తువుల్లో ఈ వ్యానిటీ వ్యాన్‌ కూడా చేరిపోయింది. భర్త ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్‌కి ట్రీట్‌గా శిల్పాశెట్టి నైట్ రెస్టారెంట్‌లో కుటుంబ సభ్యులందరికి డిన్నర్ పార్టీ ఇచ్చింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bollywood heroine, Shilpa sheety

తదుపరి వార్తలు