Home /News /movies /

RAJIV KANAKALA IS MY FATHER A CHILD ARTIST GIVEN A BIG SHOCK TO ANCHOR SUMA IN CASH GAME SHOW PK

Suma Kanakala: రాజీవ్ కనకాల నా తండ్రి.. యాంకర్ సుమకు షాకిచ్చిన ఆ నటి..

యాంకర్ సుమ (Anchor Suma)

యాంకర్ సుమ (Anchor Suma)

Suma Kanakala: వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది కదా.. ఇది విన్నపుడు సుమ కనకాల కూడా ఇదే రేంజ్‌లో షాక్ అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాంకర్స్‌లో సుమ ముందుంటుంది. ఈమె కంటే టాప్ ఎవరూ లేరిక్కడ.

వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది కదా.. ఇది విన్నపుడు సుమ కనకాల కూడా ఇదే రేంజ్‌లో షాక్ అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాంకర్స్‌లో సుమ ముందుంటుంది. ఈమె కంటే టాప్ ఎవరూ లేరిక్కడ. అంతగా ఇమేజ్ సంపాదించుకుంది సుమ. పైగా టీవీలో ఏ ప్రోగ్రామ్‌లో చూసినా ఈమె కనిపిస్తుంటుంది. తనపై తనే జోకులు వేసుకుంటుంది. అందుకే అంతగా నచ్చేస్తుంది ఈ యాంకర్. ఇదిలా ఉంటే తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌లో జరిగిన ఓ వింత సంఘటనతో షాక్ అయిపోయింది సుమ. ప్రతీవారం అక్కడికి వచ్చే సెలెబ్రిటీలతో ఓ ఆట ఆడుకుంటుంది సుమ. కొందరు రివర్స్‌లో సుమకు కూడా పంచులు వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వారం అంతా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చిన స్టార్స్ వీళ్లంతా. చిన్నప్పటి నుంచి కూడా క్యాష్ షోకు వస్తూనే ఉన్నారు. వాళ్లను అలాగే చూస్తూనే ఉంది సుమ. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రాజన్న ఫేమ్ ఆనీతో పాటు మరికొందరు పిల్లలు ఈ షోకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అంతా రివర్స్‌లో సుమకు కౌంటర్స్ వేయడం మొదలు పెట్టారు. ఆమె వయసుపై కూడా ఓ రేంజ్‌లో సెటైర్లు వేసారు బాలనటులు. పిల్లలు కాదు పిడుగులు అనేలా రెచ్చిపోయారు. అందులో ఆనీ అయితే రాజీవ్ కనకాలను తన తండ్రి అని చెప్పుకొచ్చింది. దాంతో అక్కడే ఉన్న సుమ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అదేంటి.. మా ఆయనకు నీకు నాన్న అవుతాడా.. అదేంటి నాకు తెలియదే అంటూ నోరెళ్లబెట్టింది.

ఏం లేదండీ.. నేను, మీ ఆయన ఓ సినిమాలో తండ్రీ కూతుళ్లుగా నటించాం అందుకే నాన్న అంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. దాంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేసారు. రాజీవ్ కనకాల తెలుగులో చాలా సినిమాలు చేసాడు. కానీ సరైన గుర్తింపు రాలేదు. మధ్యలో కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసినా కూడా స్టార్ కారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం కాలేకపోయాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు