సుమ గురించి ఆ విషయం అస్సలు తెలియదు.. పట్టించుకోను.. : రాజీవ్ కనకాల

సుమ,రాజీవ్ కనకాల (File Photos)

సినీ ఇండస్ట్రీలో దేవదాస్ కనకాలకు ఉన్న ఇమేజ్.. సుమకు తెలియకుండానే ఆమె కెరీర్‌కు ఉపయోగపడిందన్నారు రాజీవ్ కనకాల.సక్సెస్‌ఫుల్‌గా యాంకర్ తాను రాణించడం వెనుక రాజీవ్ సపోర్ట్ ఉందని సుమ చెప్పడం ఆమె గొప్పదనం అన్నారు.

  • Share this:
    తెలుగు టెలివిజన్ తెరపై నంబర్ వన్ యాంకర్ ఎవరు అనగానే.. టక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ.సుమ యాంకరింగ్ అంటే.. ఇంటిల్లిపాదీ టీవీ ముందు కూర్చొంటారు. ఆమె యాంకరింగ్‌కు అంత పాపులారిటీ ఉంది.టీవీ షోలే కాదు.. సినిమా ఈవెంట్స్‌కు కూడా సుమ యాంకరింగే కావాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. సుమ నో అంటే తప్ప ఆ ఛాన్స్ మరొకరికి వెళ్లదు. మరి అంత పాపులారిటీ,డిమాండ్ ఉన్న సుమ రెమ్యునరేషన్ ఎంత ఉండాలి..? తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంటుంది.

    ఇదే విషయంపై సుమ భర్త రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సుమ రెమ్యునరేషన్ గురించి గానీ తన సంపాదన గురించి గానీ అసలు పట్టించుకోనని చెప్పారు. సుమ రెమ్యునరేషన్ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని అన్నారు. సుమ తన కెరీర్‌లో ఆ స్థాయికి వెళ్లడం వెనుక తాను చేసిందేమీ లేదని.. ఆ క్రెడిట్ తాను
    తీసుకోనని చెప్పారు. అయితే సినీ ఇండస్ట్రీలో దేవదాస్ కనకాలకు ఉన్న ఇమేజ్.. సుమకు తెలియకుండానే ఆమె కెరీర్‌కు ఉపయోగపడిందన్నారు.సక్సెస్‌ఫుల్‌గా యాంకర్ తాను రాణించడం వెనుక రాజీవ్ సపోర్ట్ ఉందని సుమ చెప్పడం ఆమె గొప్పదనం అన్నారు. అయితే సుమ తన కెరీర్‌ను కొనసాగించడానికి తన కుటుంబం ఆమెకు కావాల్సినంత స్పేస్ ఇచ్చిందని చెప్పారు.
    First published: