రజనీకాంత్ (Rajinikanth) నిస్సందేహంగా తమిళ సినిమా చరిత్రలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరు. తెరపై ఆకర్షణీయమైన నటన మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా ఆయనకు ఎంతో వన్నె తెచ్చింది. రజినీకాంత్ ఎక్కవగా తమిళ చిత్రాలలో పనిచేసినప్పటికీ, బాలీవుడ్ (Bollywood), తెలుగు, కన్నడ మరియు మలయాళంతో సహా ప్రముఖ చలనచిత్ర పరిశ్రమల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ మల్టీస్టార్ చిత్రాల్లో నటించడానికి వెనుకాడరు. పాత్రకే ఎక్కు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం రజినీకాంత్ 71వ జన్మదిన వేడుకలుజరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దేశంలో ప్రముఖ నటులతో కలిసి నటించిన చిత్రాలు.. వాటి విశేషాలు
అమితాబ్ బచ్చన్
అమితాబచ్చన్ (Amitabh Bachchan), రజినీకాంత్ ఇద్దరి పైర్ సినిమా తెరపై గ్రాండ్‌గా ఉంటుంది. వీరిద్దరి ప్రస్తావన రాగానే మొదట గుర్తొచ్చేది. హమ్, జిరాఫ్తార్ మరియు అంధ కానూన్ వంటి చిత్రాలు. హమ్లో, తలైవా పోలీస్ ఇన్స్పెక్టర్గా, అమితాబ్ బచ్చన్ తమ్ముడిగా కనిపించారు. ఈ చిత్రంలో గోవిందా వారి సోదరుడిగా కూడా నటించారు.
ఎన్టీఆర్..
రజనీకాంత్ 1979లో విడుదలైన టైగర్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీ రామారావుతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్, రజనీకాంత్‌లు కలిసి రాజా, రషీద్ అనే ఇద్దరి స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
చిరంజీవి
తెలుగు ఇండ్రస్ట్రీలో మెగాస్టార్ చిరంజివి (Chiranjeevi) తో కూడా రజినీకాంత్ కలిసి నటించారు. కాళి (1980), బందిపోటు సింహం (1982), మాప్పిళ్ళై (1989) వంటి చిత్రాలలో రజనీకాంత్ చిరంజీవితో కలిసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.
మమ్ముట్టి..
1991లో విడుదలైన దళపతిలో రజనీకాంత్, మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు క్లైమాక్స్‌లతో విడుదలైంది.
AIIMS Jobs : ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.. వేతనం రూ.. 1,42,506.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!
అసలు కథలో రజనీకాంత్ పాత్ర చివరలో చనిపోతుండగా, తమిళనాడులోని అతని అభిమానుల నుంచి ఎదురుదెబ్బ తగలుతుందనే భయంతో మేకర్స్ ఆలోచనను వదులుకోవలసి వచ్చింది. చిత్రం యొక్క తమిళ వెర్షన్ విభిన్నమైన క్లైమాక్స్‌తో విడుదలైంది. ఇది చివరలో మమ్ముట్టి పాత్ర మరణిస్తున్నట్లు చూపుతుంది. అయితే మరొక వెర్షన్ రజనీకాంత్ పాత్ర యొక్క మరణాన్ని చూపింది.
అమీర్ ఖాన్
కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకొనే అమీర్‌ఖాన్ (AmirKhan), మాస్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ కలిసి పనిచేశారు. రజనీకాంత్, అమీర్ ఖాన్ కలిసి నటించిన చిత్రం ‘అతంక్ హి ఆటంక్’. హాలీవుడ్ మూవీ ‘గాడ్ ఫాదర్’కి రీమేక్ గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aamir Khan, Amitabh bachchan, Chiranjeevi, Mammootty, Megastar Chiranjeevi, NTR, Rajini Kanth, Rajinikanth, Super star Rajinikanth