సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. రజినీ కాంత్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ మూవీలలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ మరి కొన్ని రోజుల్లో కోలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ‘జైలర్’అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘జైలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో రక్తం మరకలతో ఉన్న కత్తి వేలాడుతూ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రజనీకాంత్ నటించబోతున్న 169వ చిత్రం ఇది.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే విజయ్‌తో ‘బీస్ట్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించి సత్తా చాటారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఇప్పుడు రజనీకాంత్ చిత్రం కోసం ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేశారని తెలిసింది. యాక్షన్ డ్రామాగా రూపొందించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్నందించబోతున్నారు. త్వరలో సెట్స్‌మీదకెళ్లనుంది.
Vaa thalaiva ????????????#Jailer@rajinikanth @Nelsondilpkumar @sunpictures pic.twitter.com/CtqX1QiC3z
— Anirudh Ravichander (@anirudhofficial) June 17, 2022
సన్ పిక్చర్స్ నిర్మస్తోన్న ఈ సినిమాకు మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మిగిలిన నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aishwarya Rai, Aishwarya Rai Bachchan, Kollywood, Rajni kanth, Rajnikanth