సంక్రాంతి రేసులో సూపర్ స్టార్... రజినీకాంత్ ‘పేట’కు చోటెక్కడా..

ఇప్పటికే 2019 సంక్రాంతి రేసులో మూడు పెద్ద సినిమాలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. ఇది చాలదన్నట్టు రజినీకాంత్ ‘పేట’ మూవీతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. ఈ విషయం అఫీషియల్‌గా కన్ఫామ్ అయింది.

news18-telugu
Updated: December 21, 2018, 2:04 PM IST
సంక్రాంతి రేసులో సూపర్ స్టార్... రజినీకాంత్ ‘పేట’కు చోటెక్కడా..
రజినీకాంత్ ‘పేట్టా’ మూవీ
  • Share this:
ఇప్పటికే 2019 సంక్రాంతి రేసులో మూడు పెద్ద సినిమాలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. జనవరి 9న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీతో పొంగల్ పోటీ మొదలు కానుంది. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే అంటే జ‌న‌వ‌రి 11న రామ్ చ‌ర‌ణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విన‌య విధేయ రామ’ రానుంది. ఆ మ‌రుస‌టి రోజే సంక్రాంతి తోడల్లుళ్లుగా వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ "ఎఫ్ 2"తో రానున్నారు.

Three big movies in Sankranti 2019 race.. 50 రోజుల ముందే సంక్రాంతి స‌మ‌రం తెలుస్తుంది. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. జ‌న‌వ‌రిలో ఉన్న‌ది 31 రోజులు.. అంత‌కంటే ఎక్కువ రోజులు అయితే లేవు క‌దా. ఇప్ప‌టికే ఆ నెల‌లో నాలుగు భారీ సినిమాలు వ‌స్తున్నాయి. ఇంకా వ‌స్తామంటే టైమ్ ఉంటుందేమో కానీ క‌లెక్ష‌న్లు తీసుకురావ‌డానికి థియేట‌ర్స్ ఉండాలి క‌దా. mr majnu release date,akhil,akhil mr majnu release date,mr majnu in janaury,venky atluri akhil,ram charan balakrishna venkatesh sankranti 2019,f2 ntr vinaya vidheya rama,సంక్రాంతి 2019,అఖిల్ మిస్టర్ మజ్ను,జనవరిలో మిస్టర్ మజ్ను విడుదల,ఎఫ్2 ఎన్టీఆర్ బయోపిక్ వినయ విధేయ రామ సంక్రాంతి,జనవరిలో భారీ సినిమాలు
జనవరి సినిమాలు


ఇది చాలదన్నట్టు రజినీకాంత్ ‘పేట’ మూవీతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. ఈ విషయం అఫీషియల్‌గా కన్ఫామ్ అయింది. ఇప్పటి వరకు రజినీకాంత్ నటించిన ‘పేట’ మూవీని తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తారనున్నారు. కానీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత వల్లభనేని అశోక్ భారీ రేటుకే దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ ఈమూవీని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నానని అనౌన్స్ చేసాడు. తమిళంలో ఈ మూవీని జవనరి 11న విడుదల చేస్తున్నారు కాబట్టి.. ఇక్కడ కూడా అదే రోజు ఈ మూవీ రిలీజ్ చేయాలి.

Rajinikanth’s Petta Movie Teaser Released
‘పేట్టా’ మూవీలో రజినీకాంత్
ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదలైతే సరైనన్ని థియేటర్స్ దొరుకుతాయా అనేది ఎవరు ఆలోచిచండం లేదు. ఈ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై ఖచ్చితంగా పడుతోంది. సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ ఎంత లేదన్నా రెండు వారాలైతే ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకని ఈ టైమ్‌లో రజినీకాంత్ సినిమాకు సరైన థియేటర్స్ దొరకడం కష్టం.గత కొన్నేళ్లుగా రజినీకాంత్ నటించిన ఏ సినిమా తెలుగులో సరైన ఫలితాలను అందుకోవడం లేదు. రీసెంట్‌గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.O’ మూవీ నైజాం ఏరియా తప్పించి ఎక్కడా పెట్టిన పెట్టుబడి బయ్యర్స్‌కు తిరిగి తీసుకు రాలేపోయింది. గతంలో లాగా రజినీకాంత్ సినిమాలకు తెలుగులో అంతగా క్రేజ్ ఉండటం లేదు. మొత్తంగా ఈ సంక్రాంతి పోరులో సూపర్ స్టార్ ‘పేటా’ ఎంత వరకు నిలుస్తుందో చూడాలి.


ఇది కూడా చదవండి #FlashBack2018: బాక్సాఫీస్‌‌ డుమ్మా కొట్టిన హీరోలు

#FlashBack2018: బాలీవుడ్ టాప్ డిజాస్టర్ మూవీస్@2018

#FlashBack2018: ఈ ఏడాది టాప్ హీరోయిన్లు వీళ్లే..
First published: December 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు