రజినీకాంత్ ‘పేట’ తెలుగు ట్రైలర్ విడుదల..లుంగీ డాన్స్ చేస్తోన్న తలైవా ఫ్యాన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ ఎత్తున నిర్మించాడు. తాజాగా ‘పేట’ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. 

news18-telugu
Updated: January 2, 2019, 12:01 PM IST
రజినీకాంత్ ‘పేట’ తెలుగు ట్రైలర్ విడుదల..లుంగీ డాన్స్ చేస్తోన్న తలైవా ఫ్యాన్స్
‘పేట’లో రజినీకాంత్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ ఎత్తున నిర్మించాడు. తాజాగా ‘పేట’ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

ఇప్పటి వరకు తమిళ వెర్షన్ ‘పేట’  ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసిన రజినీకాంత్ అభిమానులు ..తాజాగా  విడుదలైన తెలుగు ట్రైలర్‌‌ను చూసి లుంగీ డాన్స్ చేస్తున్నారు.

‘పేట’లో రజినీకాంత్ మరోసారి  తనదైన ఔట్ అండ్  ఔట్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. .ఈ చిత్రంలో రజినీకాంత్ హాస్టల్ వార్డెన్‌గా నటించాడు. అసలు రజినీకాంత్ వార్డెన్‌గా ఎందుకు దూరంగా అజ్ఞాతవాసం చేస్తున్నడన్నదే ఈ మూవీ స్టోరీలా కనబడుతోంది. ‘భాషా’ తరహాలో ఈ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కీలకం అనే విషయం అర్థమవుతోంది.‘పేట’లో రజినీకాంత్ సరసన త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్‌గా నటించారు. మరోవైపు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దీకి, బాబీ సింహా ముఖ్యపాత్రల్లో నటించారు. అనిరుథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోస్

ఇది కూడా చదవండి 

మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన రానా..కథానాయిక ఎవరంటే

'బరైలీ కీ బర్ఫీ' రీమేక్‌లో నాగచైతన్య

ఒక్క హిట్ ప్లీజ్.. ఫ్లాపుల్లో మునిగిపోయిన తెలుగు హీరోలు..
First published: January 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు