హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: బాలు త్వరగా కోలుకోవాలని రజినీకాంత్ సందేశం..

SP Balasubrahmanyam: బాలు త్వరగా కోలుకోవాలని రజినీకాంత్ సందేశం..

ఎస్పీ బాలు ఆరోగ్యంపై రజనీకాంత్ వీడియో సందేశం (Twitter/Photo)

ఎస్పీ బాలు ఆరోగ్యంపై రజనీకాంత్ వీడియో సందేశం (Twitter/Photo)

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో  సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలూ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని వీడియో సందేశం ఇచ్చారు.

  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో  సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ఏమైందో అంటూ అభిమానులు కూడా దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. బాలు బాగుండాలని.. బయటికి వచ్చి మళ్లీ పాటలు పాడాలంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇళయరాజా కూడా బాలు నువ్వు త్వరగా రా అంటూ వీడియో పోస్ట్ చేసాడు. ఇప్పటికే కమల్ హాసన్, చిరంజీవి, ఏఆర్ రహామాన్ సహా పలువురు ప్రముఖులు ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. తాజాగా బాల సుబ్రహ్మణ్యం పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని సూపర్ స్టార్ రజినీకాంత్ వీడియో సందేశం ఇచ్చారు.

  భారత దేశంలో వివిధ భాషల్లో 50 ఏళ్లకు పైగా తన గాన ప్రతిభతో అలరిస్తున్నారు ఎస్పీబాలు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్టు తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు తాజాగా తన తండ్రి కరోనా నుంచి కోలుకుంటున్నట్టు ఎస్పీ చరణ్ తెలిపారు.

  నిన్నటి లాగే ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు.డాక్టర్లు వాళ్ల చికిత్సను కొనిసాగిస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎస్పీ చరణ్ ధన్యవాదాలు తెలిపారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Rajinikanth, SP Balasubrahmanyam, SP Charan Singer, Tollywood

  ఉత్తమ కథలు