RAJINIKANTHS DAUGHTER SOUNDARYA RAJINIKANTH SAYS MY FATHER IS GODS SON TA
మా నాన్న రజినీకాంత్ నిజంగానే దేవుడి బిడ్డ.. తలైవా కూతురు సంచలన వ్యాఖ్యలు..
చిన్న కూతురు సౌందర్యతో రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయనకు ఆరోగ్యం బాగాలేక సింగపూర్లో చికిత్స చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో సింగపూర్లో ఎన్నో రోజుల తర్వాత 2011 జూలై 13న తిరిగి భారత్ చేరకున్నారు. ఈ సంఘటన జరిగి నిన్నటికీ ఎనిమిదేళ్లు పూర్తైయింది. ఈ సందర్భంగా రజినీకాంత్ కూతురు రజినీకాంత్ తిరిగి వచ్చిన ఆరోజును గుర్తు చేసుకుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయనకు ఆరోగ్యం బాగాలేక సింగపూర్లో చికిత్స చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో సింగపూర్లో ఎన్నో రోజుల తర్వాత 2011 జూలై 13న తిరిగి భారత్ చేరకున్నారు. ఈ సంఘటన జరిగి నిన్నటికీ ఎనిమిదేళ్లు పూర్తైయింది. ఈ సందర్భంగా రజినీకాంత్ కూతురు రజినీకాంత్ తిరిగి వచ్చిన ఆరోజును గుర్తు చేసుకుంది. అంతేకాదు అప్పట్లో రజినీ కాంత్ చెన్నై వచ్చినపుడు అభిమానులు చేసిన సందడిని సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో షేర్ చేసింది. 13 జూలై 2011 సింగపూర్లో చికిత్స పూర్తైయిన తర్వాత నాన్న తిరిగి చెన్నైకి వచ్చిన రోజిది. ఈ సందర్భంగా సౌందర్య తన తండ్రి గురించి మాట్లాడుతూ.. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు నాన్నా. అప్పట్లో మా తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ కాస్తంత భావోద్వేగంతో ట్వీట్ చేసింది.
A day we will forever remember,the day we returned with Appa to Chennai after his medical treatment in singapore #13.7.11 8 years ago. You are truly gods child Appa. To all those hearts who prayed and continue to pray for my father and my family THANK YOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/ylBWOjTvTW
— soundarya rajnikanth (@soundaryaarajni) July 13, 2019
రజినీకాంత్ విషయానికొస్తే.. ఈ యేడాది ‘పేట’తో పలకరించిన రజినీకాంత్.. ఇపుడు ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్బార్’తో పలకరించనున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.