'దర్బార్'కి రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Rajinikanth Remuneration : లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో ఏఆర్ మురుగదాస్ దర్శకుడిగా తెరకెక్కుతున్న దర్బార్ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. దాదాపు రూ.250కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు.

news18-telugu
Updated: November 15, 2019, 1:33 PM IST
'దర్బార్'కి రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
‘దర్బార్‌’లో పోలీస్ పాత్రలో సూపర్ స్టార్(Image :Twitter)
  • Share this:
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. అప్పట్లో ఆయన రూ.50కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిసి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది. అలాంటిది ఇప్పుడాయన ఏకంగా రూ.100కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. రజనీకాంత్ చివరి చిత్రం రోబో 2.0 చిత్రం వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ స్థాయిలో ఆయన రెమ్యునరేషన్ అందుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే  దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్‌గా రజనీకాంత్ మరోసారి రికార్డుల్లోకి ఎక్కుతారు.

కాగా, లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో ఏఆర్ మురుగదాస్ దర్శకుడిగా తెరకెక్కుతున్న దర్బార్ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. దాదాపు రూ.250కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. రజనీకాంత్ భారీ హిట్ అందుకుని చాలా రోజులవుతుండటంతో దర్భార్ సినిమా ఆ లోటును తీరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు