అవును సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు మహేష్ బాబు, ప్రభాస్‌లను టార్గెట్ చేసాడు. అసలు రజినీకాంత్ ఏంటి..ప్రభాస్, మహేష్ బాబులను టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..ఏం లేదు.. ప్రస్తుతం రజినీకాంత్, మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ముంబాయిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సరిగ్గా వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు..అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు మహేష్ బాబు.ఇంకో వైపు ప్రభాస్ కూడా ‘సాహో’ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఈసినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను 1970,80 నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలు సంక్రాంతికి విడుదలైయి చాల మటుకు సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రభాస్ విషయానికొస్తే..‘వర్షం’ తర్వాత మరే సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. ఇక రజినీకాంత్ విషయానికొస్తే..చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. అందుకే ఈసారి మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దర్బార్’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. మరి ఇపుడు చెబుతున్నట్టు ఈ ముగ్గురు నిజంగానే సంక్రాంతి బరిలో నిలబడతారా లేకపోతే మధ్యలో ఎవరైన మిడిల్ డ్రాప్ అవుతారా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, AR Murugadoss, Maharshi, Mahesh Babu, Maheshbabu25, Nayanathara, Prabhas, Prabhas20, Rajini Kanth, Rajnikanth, Tamil Nadu Lok Sabha Elections 2019, Tamil News, Telugu Cinema, Tollywood