Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: February 2, 2020, 10:27 PM IST
రజినీకాంత్ సినిమాలో మరోసారి నయనతార (rajinikanth nayanthara)
నయనతార అలాంటిది.. ఇలాంటిది అంటూ తమిళనాట ఇప్పుడు చాలా వార్తలే వినిపిస్తున్నాయి. నయన్ చాలా దారుణంగా నిర్మాతలతో ఆడుకుంటుంది అంటూ ఓ నిర్మాత మీడియా ముందే చాలా నిజాలు చెప్పాడు. అయితే అంత చేస్తున్నా కూడా మరి నయనతారనే ఎందుకు హీరోయిన్గా తీసుకుంటున్నారంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు మాత్రం వాళ్ల దగ్గర సమాధానం ఉండదు. అన్ని కండీషన్స్ ముందు చెప్పిన తర్వాతే కదా సినిమాలోకి వస్తుంది.. మరి అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటూ నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక్కో సినిమాకు ఈమె ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నా కూడా ఇప్పటికీ నయనకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

రజినీకాంత్ సినిమాలో మరోసారి నయనతార (rajinikanth nayanthara)
అందులోనూ సూపర్ స్టార్స్ ఎక్కువగా ఈమెతో రొమాన్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మరోసారి రజినీకాంత్ సినిమాలో నటించబోతుంది ఈ ముద్దుగుమ్మ. సిరుత్తై శివ దర్శకత్వంలో రజినీ నటిస్తున్న సినిమాలో నయననే హీరోయిన్గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. అందులో రెండు అతిథి పాత్రలు చేసిందనుకోండి.. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’.. మొన్నటికి మొన్న మురుగదాస్ ‘దర్బార్’ సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, నయనతార.

రజినీకాంత్ సినిమాలో మరోసారి నయనతార (rajinikanth nayanthara)
మధ్యలో శంకర్ శివాజీలో స్పెషల్ సాంగ్ చేసింది.. ఆ తర్వాత ‘కుశేలన్ (తెలుగులో ‘కథానాయకుడు’) సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది నయన్. ఇప్పుడు ఐదోసారి ఇప్పుడు రజనీ, నయనతార స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోకి నయనతార వచ్చింది. మరి ఈ చిత్రంలో నయన్, రజినీ రొమాన్స్ ఉంటుందా లేదంటే ఏదైనా కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనేది చూడాలి. గతేడాది అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన విశ్వాసం సినిమాలో కూడా నయనతారే హీరోయిన్.
Published by:
Praveen Kumar Vadla
First published:
February 2, 2020, 10:27 PM IST