చిరంజీవి, బాలకృష్ణల మధ్యలో నలిగిపోతున్న రజినీకాంత్..

అవును సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు చిరంజీవి, బాలకృష్ణల మధ్య నలిగిపోతున్నాడు. తలైవా ఏమిటి ఈ సీనియర్ హీరోల మధ్య నలిగిపోవడమేమిటి అని డౌట్ పడుతున్నారా ? వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: May 15, 2020, 12:36 PM IST
చిరంజీవి, బాలకృష్ణల మధ్యలో నలిగిపోతున్న రజినీకాంత్..
చిరు, బాలయ్యల మధ్య నలిగిపోతున్న రజినీ (File/Photos)
  • Share this:
అవును సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు చిరంజీవి, బాలకృష్ణల మధ్య నలిగిపోతున్నాడు. తలైవా ఏమిటి ఈ సీనియర్ హీరోల మధ్య నలిగిపోవడమేమిటి అని డౌట్ పడుతున్నారా ? వివరాల్లోకి వెళితే..  తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సూపర్ హిట్ సినిమా టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం వెరీ కామన్. హిట్ సినిమా టైటిల్స్‌ రిపీటైతే.. ఆడియన్స్ కూడా ఆయా సినిమాలను చూడాలనే ఆసక్తి  ప్రదర్శిస్తుంటారు. అది కాకుండా పెద్ద స్టార్ హీరో సినిమా టైటిల్ పెట్టుకుంటే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే కారణంతో ఆ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం రజినీకాంత్ కూడా తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో ‘అన్నతే’అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో దీనర్ధం అన్నయ్య. అందుకే రజినీకాంత్ తన సినిమాకు తెలుగు వెర్షన్‌కు ‘అన్నయ్య’ అనే టైటిల్ దాదాపు ఖాయమన్నట్టు వినిపించింది. అన్నయ్య అనే టైటిల్ చిరంజీవి నటించిన పాత సూపర్ హిట్ సినిమా పేరు తెలిసిందే. తాజాగా ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమాకు ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. పెద్దన్నయ్య టైటిల్ గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన పాత సూపర్ హిట్ మూవీ.

rajinikanth new movie title Annathe telugu title either chiranjeevi annayya or balakrishna peddannayya here are the details,super star rajinikanth,chiranjeevi,balakrishna,rajinikanth balakrishna,rajinikanth,rajinikanth new movie annayya,rajinikanth next movie annayya title,rajinikanth next movie balakrishna peddannayya,nbk peddannayya,balayya peddannayya rajinikanth next movie title,rajinikanth annathe,tollywood,telugu cinema,రజినీకాంత్,చిరంజీవి,రజినీకాంత్ అన్నయ్య,రజినీకాంత్ అన్నయ్య టైటిల్,రజినీకాంత్ అన్నయ్యరజినీకాంత్ అన్నయ్య టైటిల్,చిరంజీవి రజినీకాంత్,పెద్దన్నయ్య గా రజినీకాంత్,బాలకృష్ణ పెద్దన్నయ్య రజినీకాంత్,బాలకృష్ణ బాలయ్య రజినీకాంత్ పెద్దన్నయ్య
శివ దర్శకత్వంలో ‘అన్నతే’ మూవీ చేస్తోన్న రజినీకాంత్


ఐతే.. రజినీకాంత్..  ‘అన్నతే’ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా  నటిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకు తెలుగులో ‘పెద్దన్నయ్య’ టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. మొత్తానికి రజినీకాంత్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు చిరంజీవి టైటిల్ పెట్టాలా లేకపోతే బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టాలా అనే విషయమై తర్ణన భర్జనలు నడుస్తున్నాయి. ఫైనల్‌గా రజినీకాంత్ తెలుగులో విడుదలయ్యే తన సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తాడా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా నటిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దీపావళికి విడుదల చేయాలనుకన్నారు. కానీ ఇపుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వరుసగా సంక్రాంతికి రజినీకాంత్ నటించిన ‘పేట’, దర్బార్’ సినిమాలు విడుదయ్యాయి. ఇపుడు అన్నతే కూడా సంక్రాంతి బరిలో ఉండటం విశేషం.
First published: May 15, 2020, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading