Rajinikanth Political Entry | సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు గత రెండు మూడు రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 70 సంవత్సరాలు. మరోవైపు ఎన్నికలు అంటే మాములు విషయం కాదు. ప్రజల్లో వెళ్లాలి. ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో రజినీకాంత్ వయసు ఆరోగ్యం అందుకు సహకరించడం అంత తేలిక కాదు. అందుకే వచ్చే తమిళనాడు ఎన్నికల వరకు రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం డౌటే అంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. అంతేకాదు రజినీకాంత్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
— Rajinikanth (@rajinikanth) October 29, 2020
నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్న గత రెండు మూడు రోజులుగా ఓ వార్త సర్క్యూలేట్ అవుతుంది. ఇవన్ని అవాస్తవం. నేను రాజకీయ పార్టీ పెట్టడం ఖాయం. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో కొత్త పార్టీలో రంగంలోకి దిగబోతున్నట్టు రజీనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు త్వరలో పార్టీ జెండా..అజెండా ప్రకటించడంతో పాటు అభిమానులతో కలిసి ప్రజల్లోకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంత మంది అభిమానులు తమిళనాడులో ఊరూరా కొన్ని రాజకీయ కమిటీలను ఏర్పాటు చేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ కమిటీలు స్థానికంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ లోగా రజినీకాంత్ .. శివ దర్శకత్వంలో చేస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ కూడా ఈ లోపు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. తన పొలిటికల్ ఎంట్రీ పై రజినీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Rajinikanth, Tollywood