నేను క్షేమంగానే ఉన్నాను.. అభిమానులకు రజినీకాంత్ సందేశం..

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ప్రమాదకర సాహసాలకు పేరొందిని బేర్ గ్రిల్స్‌తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే టీవీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. తను క్షేమంగానే ఉన్నట్టు వివరణ ఇచ్చారు.

news18-telugu
Updated: January 29, 2020, 12:34 PM IST
నేను క్షేమంగానే ఉన్నాను.. అభిమానులకు రజినీకాంత్ సందేశం..
సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో రజినీకాంత్ (Facebook/Photo)
  • Share this:
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ప్రమాదకర సాహసాలకు పేరొందిని బేర్ గ్రిల్స్‌తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే టీవీ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ షో షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలో బందీపుర అడవుల్లో జరగుతోంది. ఐతే.. ఈ షో షూటింగ్ సమయంలో గాయాల పాలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేసారు. దీనిపై రజినీకాంత్ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో కొన్ని ముళ్లు గుచ్చుకున్నాయి. కాళ్ల కింద చర్మం గీసుకుపోయింది.  అంతకు మించి తనకు ఏమి కాలేదని మీడియాకు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో మీడియాకు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు గాయాల పాలైనట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మొత్తానికి తనకు ఎలాంటి గాయాలు కాలేదని రజినీకాంత్ వివరణ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Super star rajinikanth finished his part of shooting in bandipura the man vs wild series,rajinikanth injured,rajinikanth injured in man vs wild shooting,rajinikanth man vs wild,man vs wild rajinikanth,man vs wild bear grylls,rajinikanth on man vs wild,rajinikanth bandipur,rajinikanth man vs wild latest,రజినీకాంత్,రజినీకాంత్‌కు గాయాలు,రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో గాయాలు
మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ స్పాట్‌లో రజినీకాంత్ (Facebook/Photo)


ఈ యేడాది రజినీకాంత్ హీరోగా నటించిన ‘దర్బార్’ సంక్రాంతికి విడుదలైన తమిళనాడు మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం తలైవా.. శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన చాలా కాలం తర్వాత ఖుష్బూ, మీనా నటిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 29, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading