సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అవుతాడని ఎదురుచూసిన ఆయన అభిమానులకు నిరాశే మిగిలింది. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేస్తానని తలైవా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా రజనికాంత్‌కు హై బీపీ రావడం.. డాక్టర్స్ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించమని సూచించడంతో ఆలోంచిన రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటనను వెలువరిచాడు. ఇది రజినీకాంత్ అభిమానులకు నిరాశను కలిగించే అంశమే. అయితే ఆయన సన్నిహితులు మాత్రం రజినీకాంత్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
ఇక రజినీకాంత్‌కు చెకప్ చేసిన డాక్టర్స్ వారం పదిరోజులు పూర్తి బెడ్ రెస్ట్‌ను సూచించారు. దీని తర్వాత రజినీకాంత్ ఇక సినిమాలకు పరిమితమవుతాడనడంలో సందేహం లేదు. జనవరిలో వచ్చే పండుగలు గట్రా వెళ్లిపోయిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న అణ్ణాతే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని రజినీకాంత్ భావిస్తున్నాడట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రీసెంట్‌గానే ఈ విషయమై తలైవా అణ్ణాతే దర్శకుడు శివ, నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ అధినేతలతో చర్చించాడట. చర్చల అనంతరం ఫిబ్రవరి నుండి రజినీకాంత్ షూటింగ్ చేయడానికి సిద్ధం అన్నట్లు సూచన చేశాడట.
అయితే రజినీకాంత్ ఓ చిన్న ట్విస్ట్ పెట్టాడట. అదేంటంటే.. తాను షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేనని, కాబట్టి చెన్నైలోనే సెట్ వేసి షూటింగ్ చేయాలని అన్నాడట. సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tamil nadu Politics