హోమ్ /వార్తలు /సినిమా /

Rajnikanth: తప్పకుండా అందరూ చూడండి... మాధవన్ సినిమాపై రజనీకాంత్ ప్రశంసలు

Rajnikanth: తప్పకుండా అందరూ చూడండి... మాధవన్ సినిమాపై రజనీకాంత్ ప్రశంసలు

రజనీకాంత్

రజనీకాంత్

మాధవన్‌ నటిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ క్రమంలో రజనీకాంత్‌ ఈ సినిమా చూసి టీమ్‌ను మెచ్చుకున్నారు. 

ఈ మధ్య సినీయర్ హీరోలు.. తోటి నటులు, హీరోలు తీస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరి సినిమాపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఇటివలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ నటనపై టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ప్రముఖులంతా మాట్లాడారు. తాజాగా ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్...  మాధవన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.  ఏదైనా మంచి సినిమా చూడగానే ఆ టీమ్‌ను ప్రశంసించడం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న అలవాటు.

తాజాగా రజనీకాంత్‌ ప్రశంసలు అందుకున్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'. మాధవన్‌ నటిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ క్రమంలో రజనీకాంత్‌ ఈ సినిమా చూసి టీమ్‌ను మెచ్చుకున్నారు. నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే తానూ గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని రజనీకాంత్‌ ప్రశంసించారు.

నంబి నారాయణన్‌ బయోపిక్‌గా విడుదలైన 'రాకెట్రీ' వీక్షించిన రజనీ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ప్రతి భారతీయుడు, ముఖ్యంగా యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం 'రాకెట్రీ'' అని చెప్పారు రజనీకాంత్‌. మన దేశ అంతరిక్ష పరిశోధన అభివృద్ధి కోసం పద్మభూషణ్‌ నంబి నారాయణన్‌ ఎంత కష్టపడ్డారు? ఎన్ని త్యాగాలు చేశారు? అనేది 'రాకెట్రీ' సినిమాలో చక్కగా చూపించారన్న రజనీకాంత్‌..

ఈ సినిమాతో తొలిప్రయత్నంలోనే తానూ పేరు పొందిన దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని పొగిడేశారు. ఇలాంటి అద్భుతమైన కథను రియలిస్టిక్‌గా చెప్పిన మాధవన్‌కు నా అభినందనలు అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'రాకెట్రీ' సిద్ధమైందనే విషయం తెలిసిందే. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో నారాయణన్ చదువుకున్న రోజులు మొదలుకొని, రాకెట్ సైన్స్ కోసం ఆయన చేసిన కృషిని ఈ సినిమాలో చూపించారు.

First published:

Tags: Madhavan, Rajnikanth

ఉత్తమ కథలు