హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఎగ్జిట్ అంతా ఆ సినిమాలో చూపించినట్టుగానే ఉందే..

Rajinikanth: రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఎగ్జిట్ అంతా ఆ సినిమాలో చూపించినట్టుగానే ఉందే..

రజినీకాంత్ (ఫైల్ ఫోటో)

రజినీకాంత్ (ఫైల్ ఫోటో)

Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఎగ్జిట్ అంతా సినిమాటిగ్‌గా జరిగింది. అంతేకాదు తమిళ తలైవా గత పాతికేళ్లుగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. తీరా రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించి మరోసారి సంచలనం రేపారు రజినీకాంత్.

ఇంకా చదవండి ...

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఎగ్జిట్ అంతా సినిమాటిగ్‌గా జరిగింది. అంతేకాదు తమిళ తలైవా గత పాతికేళ్లుగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. అంతేకాదు డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. దీంతో రజినీకాంత్ అభిమానులు లుండీ డాన్స్ ‌తో ఊగిపోయారు. పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకున్న రజినీకాంత్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తన రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ప్రకటంచి మరోసారి సంచలనం సృష్టించాడు. ఆరోగ్యం సహకరించకపోవడం సహా ఎన్నో కారణాలున్నాయి. ప్రస్తుతం ఈయన వయసు 70 యేళ్లు. రాజకీయాలంటే ప్రజల్లోకి వెళ్లాలి. అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలను తరుచుగా కలుస్తూ ఉండాలి. పైగా కరోనా కాలం పైగా యువతీ యువకులకు  కోవిడ్ ఉన్న వాళ్లకు ఆ లక్షణాలు కనిపించడం లేదు.

అలాంటి వాళ్లతో రజినీకాంత్ కలిస్తే.. కరోనా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా ఓ ఈవెంట్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొనడంతో కరోనా సోకింది. దీంతో ఆయన తన అమూల్యమైన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. పైగా 60 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్లకు కరోనా సోకితే.. తగ్గుతుంది కానీ.. అది మిగతా అవయవాలపై చూపే ప్రభావం మాములుగా ఉండదు. ఇప్పటికే కొంత మంది రాజకీయ నాయకులు కరోనా తగ్గిన తర్వాత వివిధ కారణాలతో కన్నుమూసారు.

అరుణాచలం సినిమాలో రజినీకాంత్ (File/Photo)

దీంతో కుటుంబ సభ్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించబోతున్నట్టు ప్రకటించి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించారు రజినీకాంత్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తనను క్షమించాలంటూ మూడు పేజీల లేఖ కూడా విడుదల చేసారు రజినీకాంత్. అయితే.. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఎగ్జిట్.. రజినీకాంత్ నటించిన ఓ సినిమానే గుర్తుకు తెచ్చిందని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

rajinikanth,rajinikanth politics,vijay party name,rajinikanth party name,vijay politics,thalapathy vijay movies,rajinikanth drops from politics,విజయ్,రజినీకాంత్,రజినీకాంత్ పాలిటిక్స్
రజనీకాంత్ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తున్నట్టు ఫ్యాన్స్‌కు సింబల్ (File Image)

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘అరుణాచలం’ సినిమాలో చూపించనట్టుగా ఉంది అంటున్నారు అభిమానులు. ఆ సినిమాలో 30 రోజుల్లో ఒక్క పైసా చేతిలో లేకుండా రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే.. రూ. 300 కోట్లు రజినీకాంత్ పరమవుతోంది. కానీ రజినీకాంత్ ప్రత్యర్థులు మాత్రం ఆ డబ్బులు ఖర్చు కాకుండా ప్లాన్స్ వేసి హీరోను ముప్పతిప్పలు పెడతాడు. దీనికి విరుగుడగా రజినీకాంత్ ఓ పార్టీ స్థాపించి రుద్రాక్ష గుర్తు పెట్టుకొని మధ్యంతర ఎన్నికల్లో పాల్గొంటాడు. కానీ విలన్స్ మాత్రం హీరో కాండిడేట్‌కు అపోజిట్‌గా పోటీ చేసిన వాళ్లను ఎన్నికల బరిలోంచి తప్పిస్తారు. దీంతో హీరో కాండిడేట్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. పదవి కూడా ఓ ఆస్తి కాబట్టి.. రజినీకాంత్..తన కాండిడేట్‌తో ఎంపీ పదవికి రాజీనామా చేయించి ..తన రాజకీయ పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారు.

అరుణాచలం సినిమాలో రజినీకాంత్ (File/Photo)

అచ్చు అరుణాచలం సినిమాలో చూపించనట్టు కాకపోయినా.. దాదాపు అదే తరహాలో ఉంది రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ. సినిమాలో పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు రజినీకాంత్. కానీ రియల్ లైఫ్‌లో అసలు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకముందే.. ఎగ్జిట్ అయ్యారు. మొత్తంగా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఎగ్జిట్ అంతా సినిమాటిగ్‌గానే జరిగిందని అభిమానులతో పాటు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Kollywood, Rajinikanth, Tamil nadu Politics

ఉత్తమ కథలు