Petta Telugu Movie Review:‘పేట’ మూవీ రివ్యూ..రజినీ ఫ్యాన్స్‌కు మాత్రమే

Rajinikanth's Movie Petta Review, Box Office Report: ‘కబాలి’, ‘కాలా’, 2.O’ సినిమాల తర్వాత రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి టీజర్, ట్రైలర్‌లో చూపించిన కంటెంట్ ‘పేట’ లో ఉందా ? రజినీకాంత్ మరోసారి తన మ్యాజిక్‌ను ప్లే చేసాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

news18-telugu
Updated: January 11, 2019, 2:37 PM IST
Petta Telugu Movie Review:‘పేట’ మూవీ రివ్యూ..రజినీ ఫ్యాన్స్‌కు మాత్రమే
రజినీకాంత్ ‘పేట’(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
‘కబాలి’, ‘కాలా’, 2.O’ సినిమాల తర్వాత రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి టీజర్, ట్రైలర్‌లో చూపించిన కంటెంట్ ‘పేట’ లో ఉందా ? రజినీకాంత్ మరోసారి తన నటనతో మ్యాజిక్‌ ప్లే చేసాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

స్టోరీ విషయానికొస్తే..

రజినీకాంత్ డార్జిలింగ్‌లో ఉన్న ఒక కాలేజ్ హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అంతేకాదు అక్కడ కాలేజిలో జరిగే చిన్న చిన్న గొడవలు, రాగింగ్స్ వంటివి అరికడుతుంటాడు. ఈ క్రమంలో రజినీకి అక్కడి లోకల్ గుండాలతో పోరాడాల్సి వస్తోంది. ఆ తర్వాత హీరో ఫ్లాష్‌బ్యాక్ ఏంటో విలన్స్‌కు తెలుస్తోంది. అసలు డార్జిలింగ్‌లో హాస్టల్ వార్డెన్‌గా రజినీకాంత్ ఎందుకు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అతనేవరనేదే ‘పేట’ సినిమా స్టోరీ.

నటీనటుల విషయానికొస్తే...

రజినీకాంత్ మరోసారి తన నటనతో మాయ చేసాడు. ఈ సినిమాలో కాళిగా, పేటవీరగా సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు. ఒకవైపు యాక్షన్‌తో మరోవైపు కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ముఖ్యంగా కాలేజిలో రాగింగ్‌ను అరికట్టే సన్నివేశాలు..ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో రజినీకాంత్ నటన బాగుంది. మరోవైపు ఈ సినిమాలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిని సింహాచలం అనే గుండా పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఆ పాత్రకు ప్రాణం పోసాడు. మరోవైపు అతని కొడుకుగా విజయ్ సేతుపతి అదే రేంజ్‌లో తన విలనిజాన్ని పండించాడు. స్టూడెంట్ లీడర్‌గా బాబీ సింహా పాత్ర బాగుంది. హీరోయిన్స్ త్రిష, సిమ్రాన్‌లకు నటించే అవకాశమే రాలేదు. ఏదో హీరోయిన్‌ను పెట్టాలన్నట్టు పెట్టారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..

రజినీకాంత్ లాంటి మాస్ హీరోతో  ఎలాంటి కథతో సినిమా చేయాలో తెలియక కార్తీక్ సుబ్బరాజ్ తడబడ్డాడు. రజినీకాంత్ అవకాశం ఇచ్చాడు కదా అని రొటీన్ మాస్ మసాల స్టోరీని తీసుకొని ఆదరాబాదరాగా ‘పేట’గా తెరకెక్కించాడు. ఇంటర్వెల్‌ వరకు ఎంటర్టేనింగ్‌గా ఇంట్రెస్టింగ్‌గా సాగిన ‘పేట’ ఆ తర్వాత తడబడింది. ‘భాషా’ తరహాలో ‘పేట’లో కూడా పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్‌ను ఊహించుకున్న ప్రేక్షకులను తన కథతో ఉసురు మనిపించాడు. రొటిన్ రివేంజ్ డ్రామాతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. ఉన్నంతలో అనిరుథ్ రవిచంద్రన్ ఇచ్చిన మ్యూజిక్, ఆర్ఆర్ బాగున్నాయి. దాదాపు మూడు గంటల పాటు ఉన్న సినిమాకు ఎడిటింగ్ పెద్ద మైనస్.

నటీనటులు: రజినీకాంత్, త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దీఖీ, బాబీ సింహా
మ్యూజిక్: అనిరుథ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: తిరు
నిర్మాణం: సన్ పిక్చర్స్
దర్శకత్వం: కార్తీక్ సుబ్బారాజ్
రేటింగ్: 2.75/5

మొత్తానికి ‘పేట’ అనేది రజినీకాంత్ ఫ్యాన్స్‌ను మాత్రమే అలరించే రొటిన్ రివేంజ్ డ్రామా.

ప్లస్ పాయింట్స్

  1. రజినీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌ల  నటన

  2. ఫస్ట్ హాప్ ఎంటర్టేనింగ్

  3. అనిరుథ్ సంగీతం

  4. సినిమాటోగ్రఫీ


మైనస్ పాయింట్స్

  1. రొటీన్ స్టోరీ

  2. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

  3. ఎడిటింగ్

  4. హీరోయిన్స్‌కు ప్రాధాన్యత లేకపోవడం


 

అందాల ఈషా రెబ్బా హాట్ ఫోటోస్ఇవి కూడా చదవండి 

సినిమా థియేటర్‌లో రజనీకాంత్ అభిమాని పెళ్లి

పక్కా మాస్ మూవీ ‘పేట’...ట్విట్టర్‌లో సూపర్ హిట్ టాక్

NTR Kathanayakudu Movie Review: ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ
First published: January 10, 2019, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading