ఇంతకీ ‘పేట’ సినిమా ఎలా ఉంది.. కలెక్షన్లు ఎలా ఉన్నాయి.. రజనీకాంత్ కోరుకున్న విజయం వచ్చిందా.. ఆయన ఎప్పటి నుంచో కలలుకంటున్న కమర్షియల్ విజయం ‘పేట’ సినిమాతో అందుకున్నాడా.. ఇలాంటి అనుమానాలు చాలానే వస్తున్నాయి ఇప్పుడు అభిమానుల్లో. దీనికి సమాధానం కూడా ముందు అవును అని వచ్చినా కూడా ఇప్పుడు కూడా కాదనే వస్తుంది. తెలుగులో ‘పేట’ ఇప్పటికే డిజాస్టర్ కాగా.. తమిళనాట కూడా అంతంతమాత్రంగానే సాగుతుండటం ఇప్పుడు అభిమానులకు షాక్ ఇస్తుంది.
పైగా పొంగల్ గిఫ్ట్ గా సినిమా రావడంతో ఓపెనింగ్స్‌తో పండగ చేసుకుంటున్నారు రజనీ అభిమానులు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించాడు. రొటీన్ రివేంజ్ డ్రామా అయినా కూడా ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ ను చూపించిన విధానం వాళ్లకు తెగ నచ్చేసింది. చిన్నపిల్లాడిలా డాన్స్ చేస్తూ.. పాటలు పాడుతూ భాషా రోజులను గుర్తు చేశాడు రజినీకాంత్. అయితే వారం రోజుల తర్వాత వసూళ్లు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ చిత్రానికి తమిళనాట కేవలం 19 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్‌గా 54 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం.
వారం రోజుల్లో పండగ సెలవులు ఉన్నాయి కాబట్టి కలెక్షన్లు బాగానే వచ్చాయి కానీ ఇప్పట్నుంచి వచ్చేది అసలు లెక్క. అయితే తమిళనాట మాత్రం రజినీకాంత్ కంటే అజిత్ ‘విశ్వాసం’ సినిమా చాలా ముందుంది. అక్కడ ఈ చిత్రం సేఫ్ అయ్యేలా ఉంది కానీ ‘పేట’ మాత్రం కలెక్షన్ల వేటలో వెనకబడింది. 120 కోట్లు వస్తే కానీ సేఫ్ కానీ ఈ చిత్రం ఇప్పటి వరకు సగం కూడా తీసుకురాలేదు. అజిత్ సినిమా రావడమే రజనీకాంత్ సినిమాకు శాపంగా మారింది. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే రజినీకాంత్‌కు మరో షాక్ తప్పేలా లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Petta Movie Review, Rajinikanth, Tamil Cinema, Telugu Cinema