Rajinikanth - Peddhanna : రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. లుంగీ డాన్స్‌ చేస్తోన్న తలైవా ఫ్యాన్స్..

రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Rajinikanth - Peddhanna Trailer : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది.

 • Share this:
  Rajinikanth - Peddhanna Trailer : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా  తెలుగులో ఈ సినిమాకు ‘పెద్దన్న’ టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు.

  రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో  పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు. ఇక ’పెద్దన్న’గా రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వస్తోన్న రజినీకాంత్ లుక్ మాసీగా ఉంది. ఇప్పటికే తెలుగులో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ చిత్ర యూనిట్ ..ఇప్పటికే విడుదలైన ‘పెద్దన్న’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


  గతంలో అజిత్‌తో వీరమ్, విశ్వాసం లాంటి సినిమాల్లో కూడా ఎక్కువగా విలేజ్ కథలనే చూపించాడు శివ. ఇప్పుడు కూడా ఇదే చేసారు. పెద్దన్నగా రజినీకాంత్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.మరోవైపు ఇందులో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్‌లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు.

  Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

  తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సాంగ్‌ను కూడా ఎస్పీ బాలు గారు ఆలపించారు. త్వరలో  తెలుగు పాటను విడుదల చేయనున్నారు. అన్నాత్తే టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా బాగానే ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగులో కూడా ఈ పాటకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సినిమా తర్వాత రజినీకాంత్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  చేతులు మీదుగా దేశంలోనే సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

  National Film Awards: ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సహా ఇప్పటి వరకు నేషనల్ అవార్డులు అందుకున్న యాక్టర్స్ వీళ్లే..


  ఈ అవార్డు అందుకున్న 51వ వ్యక్తం రజినీకాంత్. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొని సోలో హీరోగా వెండితెరపై సత్తా చూపెడుతున్న మొదటి హీరో రజినీకాంత్ రికార్డులకు ఎక్కారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు అందుకొని సినిమాలు చేసినా.. అప్పటికే హీరోగా ఫేడౌట్ అయిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ పరిమితమయ్యారు. ఈ రకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొని మాస్ హీరోగా వెండితెరపై రజినీకాంత్ సత్తా చూపెడుతూనే ఉన్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: