హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth - Peddhanna: రజినీకాంత్ ‘పెద్దన్న’ మూవీ నుంచి ‘హాలి హాలి’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Rajinikanth - Peddhanna: రజినీకాంత్ ‘పెద్దన్న’ మూవీ నుంచి ‘హాలి హాలి’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

రజినీకాంత్ ‘పెద్దన్న’ హాలి హాలి’ సాంగ్ విడుదల (Twitter/Photo)

రజినీకాంత్ ‘పెద్దన్న’ హాలి హాలి’ సాంగ్ విడుదల (Twitter/Photo)

Rajinikanth - Peddhanna : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘హాలి హాలి’ అంటూ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

  Rajinikanth - Peddhanna : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా  తెలుగులో ఈ సినిమాకు ‘పెద్దన్న’ టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది.  గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజినీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముహూర్తం దగ్గర పడటంతో ఈ సినిమా నుంచి తాజాగా ’హాలీ హాలీ’  అంటూ  లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు.

  ఈ పాటను రజినీకాంత్, నయనతారపై పిక్చరైజ్ చేసారు. రజినీకాంత్ అస్వస్థతతో ఉన్నందున తెలుగులో ఈ సినిమాకు సరైన ప్రమోషన్ చేయలేకపోయారు. ఈ సినిమాను శివ డైరెక్ట్ చేశారు. ఈయన గతంలో అజిత్‌తో వీరమ్, విశ్వాసం లాంటి సినిమాల్లో కూడా ఎక్కువగా విలేజ్ కథలనే చూపించారు శివ.

  National Film Awards: ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సహా ఇప్పటి వరకు నేషనల్ అవార్డులు అందుకున్న యాక్టర్స్ వీళ్లే..

  ఇప్పుడు కూడా ఇదే చేసారు. పెద్దన్నగా రజినీకాంత్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.మరోవైపు ఇందులో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్‌లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసారు.

  Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

  తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సాంగ్‌ను కూడా ఎస్పీ బాలు గారు ఆలపించారు. త్వరలో  తెలుగు పాటను విడుదల చేయనున్నారు. అన్నాత్తే టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్‌కు కూడా బాగానే ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగులో కూడా ఈ పాటకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సినిమా తర్వాత రజినీకాంత్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Annaatthe Movie, Nayanthara, Peddhanna, Rajinikanth, Tollywood

  ఉత్తమ కథలు