Rajinikanth - Peddhanna : రజినీకాంత్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలో పెద్దన్న స్ట్రీమింగ్..

రజినీకాంత్ ‘పెద్దన్న’ (Twitter/Photo)

Rajinikanth - Peddhanna : రజినీకాంత్ అభిమానులకు శుభవార్త.. ‘దర్బార్’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో..

  • Share this:
    Rajinikanth - Peddhanna : రజినీకాంత్ అభిమానులకు శుభవార్త.. ‘దర్బార్’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. తమిళనాడులో రజినీకాంత్‌ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అంతేకాదు అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు అనుకున్నంత ఫలితం రాలేదు. ‘లింగ’ తర్వాత రజినీకాంత్ సినిమాలేవి తెలుగులో సత్తా చూపెట్టలేకపోయాయి. ఇక తెలుగులో ‘కబాలి’ ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత రాను రాను తెలుగులో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో క్రేజ్ తగ్గతూ వచ్చింది. ఆ ఎఫెక్ట్ ‘పెద్దన్న’పై పడింది. ఈ సినిమాకు ఫస్ట్ డే తెలుగులో సరైన ఓపెనింగ్స్ దక్కించుకోలేక చతికిలపడిపోయింది.

    తెలుగులో ఈ సినిమాను రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఫైనల్‌గా రూ. 4.54 కోట్లతో సరిపెట్టుకుని డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తెలుగులో రజినీకాంత్ కెరీర్‌లో ఇంత కంటే ఘోరమైన సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాను దర్శకుడు శివ తన పాత సినిమాలైన ‘వేదాలం’, ‘విశ్వాసం’ సినిమాలతో పాటు గతంలో బి.గోపాల్, కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పాత సినిమాలనే కాస్తా మార్చి తెరకెక్కిస్తాడనే పేరు ఉంది. ఇపుడు రజినీకాంత్‌తో సినిమా అనగానే సేఫ్ గేమ్ ఆడాడు. తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

    Naga Chaitanya - Samnatha : సమంత కాకుండా ముందుగా నాగ చైతన్య ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..


    ఐతే.. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ  చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో రాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్స్‌లో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు .. రజినీకాంత్ అభిమానులు ఎంచక్కా నెట్‌ప్లిక్స్ ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లకు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం.

    Drushyam Movie Review : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ..

    ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చారు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది.  గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

    NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

    ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: