హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth Health: రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే..

Rajinikanth Health: రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే..

రజినీకాంత్ (Rajinikanth)

రజినీకాంత్ (Rajinikanth)

Rajinikanth Health Updates: ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. సాయంత్రం 6 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. బీపీ అదుపులోనే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. ఆ వైద్య పరీక్షల నివేదికలతో పాటు బీపీ స్టేటస్‌ను రాత్రంతా చూసిన తర్వాత.. రజినీకాంత్‌ను డిశ్చార్జిపై రేపు నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హైబీపీతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే.

రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మాత్రమే.. భారత సినీ పరిశ్రమను షేక్ చేసిన విషయం తెలిసిందే. హైబీపీతో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, తారలు టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏమీ కాకూడదని.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. రజినీకాంత్ క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. సాధారణ అభిమానులతో పాటు సిీన తారలు, క్రీడా ప్రముఖులు కోసం రజినీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

First published:

Tags: Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు