Rajinikanth - Peddhanna : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యింది. దీపావళీ పండగ సందర్భంగా ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కథేంటీ.. ఈ సినిమా తెలుగు వారిని ఎంతవరకు ఆకట్టుకోనుందో చూద్దాం.. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.
శివ రజనీకాంత్ (Rajinikanth)కాంబినేషన్’లో వస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
To say that Mr.Rajnikanth was or is a movie star is a kind of misnomer, his loaded dialogues on the screen were taken to be what he had in mind for the real world,..
— Kevin Vadivelan (@KevinVadivelan) November 4, 2021
Time always is unfair when it comes to exposing the truth when it does #Annaththe https://t.co/ZlRRlxLJJa
dunno what else you expected from siruthai. he has given exactly what you would expect from him. movie, mostly likely, will be a hit. Veeram +viswasam+vedhalam+shit background score. #Annaththe
— Jiraya The Gallant (@VethuJerk) November 4, 2021
#Annaatthe A Totally Disappointing Action Drama!
— Mastan Bhai (@Shan_official1) November 4, 2021
The film is very outdated from the comedy to the sentiment scenes. Not sure how Siva wrote such a lackluster script.
The only positives were a few mass scenes, BGM in parts, Rajini mannerisms.
Rating: 2./5
I went @INOXMovies for Keerthy Suresh starter #annathefilm but unfortunately no one was not interested in watching movie sad to see heartbreaking #Annaatthe officially flop ? https://t.co/5rnipHE3aG pic.twitter.com/omJcMp2nLp
— S¢σтт м¢¢αℓℓ ヅ (@Mr__Alcoholic) November 4, 2021
ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజినీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tollywood news